హీరోయిన్లలో ఎవరితో డ్యాన్స్ చేయడం బన్నీకి ఈజీనో తెలుసా?

తెలుగు హీరోల్లో ‘ది బెస్ట్ అండ్ గ్రేట్’ డ్యాన్సర్స్ ఎవరు? అంటే… టాప్ 3 లిస్టులో అల్లు అర్జున్ పేరు తప్పకుండా వుంటుంది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి డ్యాన్స్‌పై ఈ స్టయిలిస్ట్ స్టార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ‘దువ్వాడ జగన్నాథమ్-డీజే’ షూటింగ్ టైములో పూజా హెగ్డే కూడా బన్నీతో డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని చెప్పింది. హీరోయిన్లు ఎవరైనా అతడి డ్యాన్స్ గురించి ఇంచుమించు ఇలాంటి మాటలే చెబుతారు. మరి, బన్నీకి ఏ హీరోయిన్‌తో డ్యాన్స్ చేయడం ఈజీగా వుంటుంది? తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. శృతి హాసన్, తమన్నాల పేర్లు చెప్పాడు బన్నీ. వాళ్ళిద్దరితో డ్యాన్స్ చేయడం ఈజీగా వుంటుందన్నాడు. అలాగే, తనకు స్ట్రీట్ డ్యాన్స్ ఇష్టమన్నారు.

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన ‘గంగోత్రి’తో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ టాప్ దర్శకులతోనే వర్క్ చేశాడు. అయితే… అతడికి కమల్ హాసన్, రజనీకాంత్‌ల‌ గురువు, లెజండరీ తమిళ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వర్క్ చేయాలని వుండేదట. ఆయన ఈలోకం విడిచి వెళ్లడంతో బన్నీ కోరిక నెరవేరలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.