మెగా అభిమానులు వేరు… అల్లు ఫ్యాన్స్ వేరు అని టాలీవుడ్ ఎప్పుడో ఫిక్సయ్యింది. ఇద్దరి మధ్య కనీ కనిపించని గోడ ఉందన్న విషయం ఫ్యాన్స్ కూడా ఒప్పుకొంటారు. అయితే అప్పుడప్పుడూ ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పుకొనే ప్రయత్నాలు కూడా కనిపిస్తుంటాయి. తాజాగా అదే జరిగింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాని మెచ్చుకొంటూ బన్నీ ఓ ట్వీట్ వేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. ముఖ్యంగా మావయ్య చిరంజీవిని పొగుడుతూ కొన్ని ఎలివేషన్లు ఇచ్చాడు బన్నీ. అవన్నీ మెగా ఫ్యాన్స్ ని హ్యాపీ చేసే అంశాలే.
బన్నీ దగ్గర ఓ మంచి అలవాటు ఉంది. తనకు ఏదైనా ఓ సినిమా నచ్చితే అభినందిస్తుంటాడు. ఆ టీమ్ ని తన దగ్గరకు పిలిపించుకొని పార్టీ కూడా ఇస్తుంటాడు. ఇలాంటి ఈవెంట్లు చాలాసార్లు జరిగాయి. ఇప్పుడు మెగాస్టార్ సినిమాని మెచ్చుకొంటూ ఓ ట్వీట్ వేశాడు. ఇది మామూలే అయినా, మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కి స్పెషల్ గా అనిపించే మూమెంట్. అల్లు అరవింద్ కూడా సినిమా చూసిన వెంటనే మీడియాతో తన ఆనందాన్ని పంచుకొన్న విషయం గుర్తుండే ఉంటుంది. మొత్తానికి చిరు ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటే అనే సంగతి ఇలాంటి సందర్భాల్లోనే అర్థం అవుతుంటుంది. నిజానికి ఇది మంచి పరిణామం కూడా. చిన్న చిన్న విషయాలకే ఫ్యాన్స్ కొట్టుకోకుండా.. ఓ సంకేతం పంపినట్టు అనుకోవాలి.
