చంద్రబాబుపై కులం ముద్ర..! అమలాపురం ఎంపీ కూడా అవే ఆరోణలు..!

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత‌ జగన్‌తో సోమవారం భేటీ అయి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవలే వైకాపాలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఆయనను జగన్ వద్దుకు తీసుకెళ్లారు. పార్టీలో చేరిన తర్వాత.. పండుల రవీంద్రబాబు… ఆమంచి, అవంతి చేసిన ఆరోపణల్నే.. తానూ చేశారు. టీడీపీపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేశారు. టీడీపీలో కులాధిపత్యం పెరిగిపోయిందంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బాటలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా చంద్రబాబుపై, టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తోందని, చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ ఉంటుందని విమర్శించారు.

వైసీపీలో చేరాక పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాదు.. సాక్షి పత్రికలో వచ్చే ఆరోపణలన్నింటినీ మరోసారి రవీంద్రబాబు చదివారు. ఓటుకు నోటు కేసుకు బయపడే చంద్రబాబు విజయవాడ పారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదా వద్దు… ప్యాకేజీ చాలని ఎంపీలతో చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో కలవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. అయితే పార్టీలో చేరే ముందు.. మీడియాకు … ఇచ్చిన ఇంటర్యూల్లో మాత్రం.. తనకు అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇవ్వబోమని చెప్పారని.. అందుకే వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు. లోటస్ పాండ్ ఎదురుగా మాత్రం… టిక్కెట్ రానందుకు.. టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు.

గతంలో ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారిగా ఉన్న రవీంద్రబాబును… చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. 2014లో అమలాపురం టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి… దివంగత నేత బాలయోగి కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏదో ఓ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అధినేత సర్దుబాటు చేస్తారని.. ఆశించారు కానీ.. ఆ సూచనలేమీ లేకపోవడంతో.. వైసీపీలో చేరిపోయారు. పైగా.. తనేదో.. సుదీర్ఘంగా… వైసీపీలో పని చేసి.. టీడీపీలోకి వెళ్లినట్లుగా.. పుట్టింటికి వచ్చినట్లు ఉందని.. ప్రకటించుకున్నారు. కొసమెరుపేమిటంటే… రెండు రోజుల కిందట.. పార్టీ మార్పు వార్తలు వచ్చినప్పుడు ఖండిస్తూ.. చంద్రబాబుపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close