అమరావతికీ చెన్నై తరహా ముప్పు!

హైదరాబాద్: వందేళ్ళచరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురియటం కాదు చెన్నైకు అసలు సమస్య. కురిసిన వర్షం తాలూకు వరదనీరు పీల్చుకోబడకపోవటం, బయటకెళ్ళకపోవటమే పెద్ద సమస్యగా మారింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా ఇలాంటి ముప్పే ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనితో రాజధానికి అమరావతి ప్రాంతం ఎంపికపై చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.

చెన్నైలో మూడు నదులు, బకింగ్ హామ్ కాలువ ఉన్నప్పటికీ అవి నగరంలో కురిసిన వర్షం తాలూకు వరదనీటిని తీసుకోలేకపోయాయి. దీనికి కారణం కబ్జాలు, అడ్డదిడ్డంగా పెరిగిపోయిన నగరం. నిర్మాణం పూర్తయ్యే అమరావతిలో ఒక నది, కృష్ణా పశ్చిమ కాలువ ఉంటాయి. మన ప్రభుత్వాధినేతలు ఊహించినట్లు అమరావతి పెరిగిపోతే, అది ఒక్కరోజులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఆ నీటిని పీల్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు, నదికి పరిసరాలలో భూ గర్భంలో కొన్ని పాయలు(paleo channels) ప్రవహిస్తుంటాయని, ఆ పాయల ఉపరితలంలోని భూమిపై ఎలాంటి నిర్మాణాలు కట్టకూడదని సూచిస్తున్నారు. రాజధాని నిర్మాణంకోసం సేకరించిన 33,000 ఎకరాలలో అధికశాతం నేలకు అడుగున ఈ పాయలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే అమరావతిలో భారీ నిర్మాణాలు కట్టేముందు క్షుణ్ణంగా జియాలజిస్ట్‌లచేత పరీక్షలు చేయించాలని అంటున్నారు. అయితే ఏపీలో కంట్రాక్టర్ల లాబీ బాగా బలంగా ఉన్నందున భారీ నిర్మాణాలు కట్టకుండా ఆగే పరిస్థితి ఉండదనే వాదన వినిపిస్తోంది. ఇక, 33,000 ఎకరాలలో అత్యంత సారవంతమైన, మూడుపంటలు పండే పొలాలు, పచ్చదనం మాయమైపోవటంవలన తీవ్రమైన పర్యావరణ అసమతౌల్యం ఏర్పడుతుందనే వాదన ఎలాగూ ఉండనే ఉంది. మరి ఈ వాదనలకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close