అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన పేదల ఇళ్లు రెడీ

రెడీగా ఉన్న ఇళ్లు ఇవ్వరు కానీ సీడ్ క్యాపిటల్ భూములు పంచుతారా..? … ఇదీ అమరావతిలో భూసమీకరణ చేసిన భూముల్లో రెండు వేలకుపైగా ఎకరాలను .. ఓటు బ్యాంక్‌కు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన బయటకు వచ్చిన తర్వాత అందరిలోనూ మదిలిన ప్రశ్న. ఎందుకంటే.. అమరావతిలో గత ప్రభుత్వం.. ఇళ్లు లేని పేదల కోసం… ఇళ్లు కట్టించింది. అవి పూర్తయ్యాయి. అలాట్‌మెంట్ కూడా అయిపోయింది. స్వాధీన పర్చడమే మిగిలింది. కానీ ఎనిమిది నెలలుగా.. ఆ ఇళ్ల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదు. ఎవర్నీ వెళ్లనీయడం లేదు.

రాజధాని ఏరియాగా 29 గ్రామాలను గుర్తించిన తర్వాత.. అక్కడి సామాజిక పరిస్థితులను.. ప్రభుత్వం అధ్యయనం చేయించింది. రైతు కూలీలకు ఉపాధి, ఇళ్లు లేని పేదలు.. తీవ్రంగా ప్రభావితమవుతారని అంచనా వేసింది. వీరిని ఆదుకోవడానికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసింది. అలాగే.. ఇళ్లు కూడా.. కట్టించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యోగుల ఇళ్లతో పాటు.. పేదల ఇళ్లను కూడా శరవేగంగా నిర్మించింది. 29 గ్రామాల్లో.. 7876 మంది ఇళ్లు లేని కుటుంబాలు ఉన్నాయని గుర్తించి .. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో ఇళ్ళ నిర్మాణం చేశారు. మొదటి విడతగా 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 157 బ్లాకుల్లో 5,024 ఫ్లాట్లు నిర్మించారు. భవన నిర్మాణాల కోసం రూ.296 కోట్లు , మౌలిక సదుపాయాల కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం వారికి ఫ్లాట్లను ఎలాట్ చేసింది. ఫినిషింగ్ వర్క్ పూర్తి చేసి వారికి అందించాల్సి ఉంది. మరో నెలలో ఆ వర్క్ పూర్తయిపోతుదంనే సమయంలో ప్రభుత్వం మారింది. అప్పట్నుంచి అవి నిరుపయోగంగా మారిపోయాయి. అన్నింటితో పాటు.. వాటినీ కూడా ప్రభుత్వం నిలిపివేసింది.

ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా పేదలకు.. రాజధాని భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామనే ప్రకటన చేసింది. రెడీగా ఉన్న ఇళ్లను ఇస్తే చాలని.. పేదలు అనుకొంటూండగా.. కొత్తగా స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఆశ పెట్టడం వెనుక దురుద్దేశం ఉందన్న భావన రాజధాని రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇళ్ల స్థలాలు వస్తాయని పేదలను ఆశ పెట్టి.. ఉద్యమం చేస్తున్న రైతులపైకి ఉసిగొల్పేందుకే ప్రభుత్వం… ఈ ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఉద్యమాన్ని నీరు గార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ కూడా ఒకటని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close