మాట‌ల‌తో మ‌న‌సు దోచుకున్న నాగ‌శౌర్య‌

తెర‌పై ఎలా ఉన్నా, బ‌య‌ట మాత్రం నాగ‌శౌర్య బాగా మొహ‌మాట‌స్థుడు. మాట్లాడ‌డానికి, నలుగురిలో క‌ల‌వ‌డానికి సిగ్గుప‌డుతుంటాడు. స్టేజీ ఎక్కితే అది కాస్త ఎక్కువే అవుతుంది. కానీ.. నాగ‌శౌర్య మారాడు. త‌న మాట‌ల‌తో మ‌న‌సు దోచుకున్నాడు. ‘అశ్వ‌ద్ధామ‌’ పాట‌ల వేడుక ఈరోజు ఖ‌మ్మంలో జ‌రిగింది. స్టేజీపై నాగ‌శౌర్య మాట్లాడిన విధానం చూస్తే.. ముచ్చ‌ట వేస్తుంది. త‌న త‌ప్పుల్ని నిర్భ‌యంగా ఒప్పుకుని, త‌న ఫ్లాపుల్ని మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు.

సాధార‌ణంగా హీరోల‌కు హిపోక్ర‌సీ ఎక్కువ‌. త‌మ ఫ్లాపుల్ని కూడా హిట్స్‌గా చెప్పుకుంటారు. అయితే నాగ‌శౌర్య అలా కాదు. ‘న‌ర్త‌న శాల‌’ ఫ్లాప్ అయ్యింద‌ని, అలాంటి తప్పు త‌న జీవితంలో చేయ‌న‌ని వేదిక పై మాటిచ్చాడు. త‌న కొత్త సినిమా ‘అశ్వ‌ద్ధామ‌’ కోసం ప్రాణం పెట్టి ప‌ని చేశాన‌ని, ఈ సినిమా కోసం త‌న‌తో ప‌ని చేస్తాన‌న్న వాళ్లు చేయిచ్చి వెళ్లిపోయార‌ని, చేయ‌ను అన్న‌వాళ్లు త‌న‌తో పాటు క‌ల‌సి ప‌నిచేశాన‌ని, త‌న జీవితం అంటే ఏమిటో ఈ సినిమా నేర్పింద‌ని ఉద్వేగ‌భ‌రితంగా చెప్పాడు శౌర్య‌. త‌న కోసం చిన్న‌ప్ప‌టి నుంచీ అమ్మానాన్న‌లు ఎంతో ఖ‌ర్చు చేశార‌ని, అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌పై ల‌క్ష‌లు పోశార‌ని, ఈ సినిమా మొద‌లెట్టిన త‌ర‌వాత అలా ఎప్పుడూ ఖర్చు పెట్టించ‌కూడ‌ద‌ని అనుకున్నాన‌ని చెప్పాడు శౌర్య‌. ఈ సినిమాని చాలా ప్రేమించాన‌ని, అందుకే ఛాతీపై ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాన‌ని వేదిక‌పై చొక్కా విప్పి… టాటూని చూపించాడు. మొత్తానికి ఈ సినిమాపై శౌర్య చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఈ చిత్రానికి త‌నే క‌థ అందించ‌డం వ‌ల్ల ఆ విశ్వాసం వ‌చ్చిందేమో.?  ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్‌లో ఉన్న థ్రిల్‌.. తెర‌పైనా క‌నిపిస్తే శౌర్య న‌మ్మ‌కం నిజం అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చినజీయర్‌ ఆలయాల యాత్ర వెనుక బీజేపీ ఉందా..!?

దుండగుల దాడుల్లో ధ్వంసమైన ఆలయాలు అన్నింటినీ చూస్తేందుకుయాత్ర చేస్తానని ప్రకటించిన చినజీయర్ స్వామి... ఆ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో...

టీఆర్‌పీ స్కాంలో పీఎంవోనీ తెచ్చిన ఆర్నాబ్..!

రిపబ్లిక్ టీవీ ఓనర్ కం జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం ఇప్పుడు.. మీడియా వర్గాల్లో పెను సంచలనంగా మారుతోంది. టీఆర్‌పీలను మార్ఫింగ్ చేసిన స్కాంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి....

ఎన్నికలపై ఓవర్ టైం వర్క్ చేస్తున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన పండుగ మూడ్‌లో లేరు. అసలు సంక్రాంతిని పట్టించుకోకుండా... పూర్తిగా పార్టీ పనిపైనే దృష్టి పెట్టారు. మూడు...

బీజేపీకి చిక్కులు తెచ్చి పెడుతున్న సోము వీర్రాజు ఆత్రం..!

బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించిన తర్వాత సోము వీర్రాజు ఆత్రానికి హద్దే లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఇట్టే బలపరచాలన్న లక్ష్యంతో ఆయన వేస్తున్న అడుగులు నవ్వుల పాలు చేస్తున్నాయి. అందర్నీ...

HOT NEWS

[X] Close
[X] Close