ప‌ద్మ‌ అవార్డులు ‌… మ‌ళ్లీ తెలుగు ఇండస్ట్రీకి మొండి చేయి

ప‌ద్మ అవార్డుల విష‌యంలో తెలుగువాళ్ల‌కు మ‌రోసారి మొండి చేయే ఎదురైంది. కాసేప‌టి క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 110 మందికి ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ‌లు ప్ర‌క‌టించింది. తెలుగు చిత్ర‌సీమ నుంచి ఒక్క‌రూ ప‌ద్మ‌ల‌కు నోచుకోలేదు. బాలీవుడ్ నుంచి మాత్రం కంగ‌నా ర‌నౌత్‌, క‌ర‌ణ్ జోహార్‌, ఏక్తా క‌పూర్‌, అద్నాన్ స‌మీల‌కు ప‌ద్మ‌లు వ‌రించాయి. నిజానికి ఈసారి ప‌ద్మ అవార్డుల‌లో సినిమా రంగం ఎక్కువ మెర‌వ‌లేదు. అందునా తెలుగులో ఒక్క పేరూ క‌నిపించ‌లేదు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, రాఘ‌వేంద్ర‌రావు లాంటి హేమా హేమీల‌కు ప‌ద్మ‌లు వ‌స్తాయ‌ని భావించారు. కైకాల అయితే ఎప్ప‌టి నుంచో ప‌ద్మ‌శ్రీ కోసం వెయిటింగ్‌. ఆయ‌న‌కు ఈసారైనా వ‌స్తుందేమో అనుకున్న‌వాళ్ల‌కి నిరాశ ఎదురైంది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన‌ప్ప‌టి నుంచీ మ‌న‌వాళ్ల‌కు ప‌ద్మ‌శ్రీ‌లు అంద‌డం లేదు. ఎవ‌రు ఎవ‌రి కోసం సిఫార్సు చేస్తున్నారో అర్థం కాక‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే, ‘వాళ్లు చూసుకుంటారులే’ అని తెలంగాణ ప్ర‌భుత్వం, ‘వీళ్లు చూసుకుంటారులే’ అని ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలుగు సినిమా రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసి ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close