ఫెడరల్ ఫ్రెంట్ దిశగా సీఎం కేసీఆర్ కొత్త‌ ప్రయత్నం..!

ఇప్పుడా, సంద‌ర్భ‌మే కాదుగా, ఎన్నిక‌లూ లేవుగా… అయినా ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ గురించి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడిన‌ట్టు..? ఎప్ప‌టికైనా దేశానికి ఫెడ‌ర‌ల్ ఫ్రెంటే దిక్కు అని ఇప్పుడెందుకు చెప్తున్నారు..? గ‌డచిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తోనే కేసీఆర్ జాతీయ రాజ‌కీయ క‌ల‌లు ఖ‌త‌మ్ అనుకున్నారంతా. కానీ, ఆయ‌న మ‌రో నాలుగేళ్ల విజ‌న్ తో ప‌ని మొద‌లుపెడుతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ విజ‌యప‌రంప‌ర గురించి గొప్ప‌గా చెప్పారు. దేశంలో ఏ పార్టీకీ ఇలా వ‌రుస‌గా విజ‌యాలు కొన‌సాగ‌డం అరుదు అన్నారు.

సి.ఎ.ఎ. గురించి మాట్లాడుతూ… తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌నీ, ఇది కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యం అన్నారు కేసీఆర్. దేశంలో అన్ని వ‌ర్గాలూ స‌మాన‌మేన‌నీ, ముస్లింల‌ను మాత్ర‌మే ప‌క్క‌న పెడ‌తామ‌నే ఆలోచ‌న స‌రైంది కాద‌న్నారు. దేశంలో ఇప్పుడు ఇదేనా పంచాయితీ, వేరే స‌మ‌స్య‌లు లేవా అని ప్ర‌శ్నించారు. ఓప‌క్క ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంద‌నీ, వృద్ధి రేటు తీవ్రంగా పడిపోతోంద‌ని నిపుణులు చెబుతుంటే కేంద్రానికి చెవికెక్క‌డం లేద‌న్నారు. ఈ దేశానికి హిందుత్వ అనే బ్రాండింగ్ వేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌రికాద‌నీ, దీంతో అంత‌ర్జాతీయంగా మ‌న దేశానికి నూక‌లు లేకుండా పోతాయ‌న్నారు. తాను భ‌యంక‌ర‌మైన హిందువున‌నీ, పెద్ద‌పెద్ద యాగాలు చేస్తుంటాన‌ని చెప్పారు. సీఏఏని చాలా రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయ‌నీ, అలాంటి రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప్రాంతీయ పార్టీల‌తో త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో ఒక కాన్ క్లేవ్ ఏర్పాటు చేయ‌బోతున్నా అన్నారు. భావ‌సారూప్య‌త ఉన్న పార్టీల‌న్నింటినీ పిలుస్తా అన్నారు.

ఈ దేశానికి ఎప్ప‌టికైనా ఫెడ‌ర‌ల్ విధాన‌మే శ్రీరామ‌ర‌క్ష అన్నారు కేసీఆర్. ఫెడ‌ర‌ల్ భావ‌జాల‌మున్న జాతీయ పార్టీగానీ, లేదా ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ గానీ ఈ దేశానికి అవ‌సర‌మ‌న్నారు. త‌రువాత కేంద్రంలో రాబోయేది క‌చ్చితంగా ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ప్ర‌భుత్వ‌మే అని జోస్యం చెప్పారు. మోడీ స‌ర్కారుపై దేశంలో నిర‌స‌న మొద‌లైంద‌నీ, అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఒక్కోటిగా ఊడుతున్నాయ‌నీ, దేశం వ్య‌క్తం చేస్తున్న నిర‌స‌న‌పై ఆత్మ ప‌రిశీల‌న చేసుకోక‌పోతే దెబ్బ‌తింటార‌న్నారు.

జాతీయ రాజ‌కీయాల క‌ల‌ను కేసీఆర్ వ‌దులుకున్న‌ట్టు లేరు. ఇప్పుడీ సీఏఏని నేప‌థ్యంగా చేసుకుని, భావ‌సారూప్య‌త గ‌ల పార్టీలూ ముఖ్య‌మంత్రుల‌తో ఒక కూట‌మి ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. కేంద్రంపై పోరాటం అంటున్నారు. సీఏఏ మీద దేశంలో ఉన్న కొంత వ్య‌తిరేక‌త‌ను ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటుకు పునాదులుగా మార్చే విజ‌న్ తోనే ఈ ప్ర‌య‌త్నం కేసీఆర్ చేస్తున్న‌ట్టుగా భావించొచ్చు. త్వ‌ర‌లోనే కుమారుడు, మంత్రి కేటీఆర్ కి సంపూర్ణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే చ‌ర్చ ఎలాగూ ఉంది. అలాంటిదేదీ లేద‌ని ఈరోజు కూడా కేసీఆర్ చెప్పినా, సంపూర్ణ ఆరోగ్య‌వంతుడిగా ఉన్నాన‌ని ఆయ‌న అంటున్నా… ఓ నాలుగేళ్ల త‌రువాతి ప‌రిస్థితి గురించైనా ఒక విజ‌న్ ఉంటుంది క‌దా. త‌న‌యుడు రాష్ట్రంతో తాను ఢిల్లీలో ఉండాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగే ప్ర‌య‌త్నం ఆరంభించార‌నే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బ్యాక్‌ టు ప్రగతిభవన్..!

వెరీజ్ కేసీఆర్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడికి బ్రేక్ పడింది. ఫామ్‌హౌస్‌ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రెండు వారాల కింద.. ప్రగతి భవన్లో ఉన్న సిబ్బంది మొత్తానికి...

టీటీడీలో ఇంకా చంద్రబాబు హవానేనట..!

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు.. ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులకు ఇంకా అసంతృప్తి చల్లారలేదు. తాను కోరుకున్నది లభించలేదన్న అసంతృప్తితోనే ఉన్నారు. అప్పుడప్పుడూ.. సుబ్రహ్మణ్య స్వామి.. తిరుమల...

క్రైమ్ : బిడ్డ హత్య..భర్త ఆత్మహత్య..! ఆమెకేం మిగిలింది..?

అందమైన కుటుంబంలో ఆమె బలహీన వ్యక్తిత్వం... బంధాలకు విలువనీయని మనస్థత్వం ఇప్పుడామెను ఒంటరిగా నిలబెట్టాయి. నిన్నటిదాకా అమ్మ అని పిలిచే బిడ్డ.. ప్రేమగా చూసుకునే భర్త కళ్ల ఎదురుగా ఉండేవారు. తాను చేసిన...

తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లకే ఐసోలేషన్ కిట్లు..!

కరోనా పాజిటివ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో అంతకతకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని బెడ్లు ఏర్పాటు చేసినా... కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినా సరిపోని పరిస్థితి. లక్షణాలు లేని.. ఓ మాదిరి లక్షణాలు ఉన్న కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close