ర‌వితేజ‌తో ర‌మేష్ వ‌ర్మ‌

‘డిస్కోరాజా’ త‌ర‌వాత ర‌వితేజ సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చింది. ర‌మేష్ వ‌ర్మ‌కి ర‌వితేజ మ‌రోసారి ఛాన్స్ ఇచ్చేశాడు. గ‌తంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘వీర’ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సో.. సో. గా ఆడింది. అయినా స‌రే, ర‌మేష్ వ‌ర్మ‌పై మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచాడు ర‌వితేజ‌. ఇటీవ‌ల ‘రాక్ష‌సుడు’తో ఓ హిట్టు కొట్టాడు ర‌మేష్. అందుకే.. ఈ ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు ఉంది. ఈ చిత్రానికి కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మార్చి నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈలోగా క‌థానాయ‌కుడు, మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. ‘రాక్ష‌సుడు’ ఓ రీమేక్ క‌థ‌. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రాన్ని ర‌మేష్ వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో తెర‌కెక్కించాడు. ఈసారీ రిమేక్‌నే ఎంచుకున్నారా, లేదంటే సొంత క‌థ‌తో సినిమా తీస్తున్నారా అనేది తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close