వావ్‌… ప్ర‌పంచ‌క‌ప్‌లో రాయుడుకి ఛాన్స్‌

బీసీసీఐ ప్ర‌క‌టించిన ప్ర‌పంచ‌క‌ప్ జాబితాలో తెలుగుతేజం రాయుడుకి చోటు ద‌క్క‌కపోవ‌డం నిరాశ‌కు గురి చేసింది. స‌త్తా ఉన్నప్ప‌టికీ రాయుడు ఛాన్స్ మిస్స‌య్యాడ‌ని తెలుగువాళ్లంతా బాధ ప‌డ్డారు. త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల రాయుడు కూడా స్పోర్టీవ్‌గా తీసుకున్నాడు. అయితే… మాజీలు మాత్రం సెల‌క్ట‌ర్ల తీరు త‌ప్పుప‌ట్టారు. ప్రపంచ‌క‌ప్‌లో రాయుడు ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దీనిపై బీసీసీఐ పున‌రాలోచించిందేమో.. ఇప్ప‌డు రాయుడుకి ప్ర‌పంచ‌క‌ప్ బెర్త్ ఖ‌రారైంది. రాయుడుతో పాటు పంత్‌, న‌వ‌దీప్ సైనీల‌ను కూడా జ‌ట్టులో తీసుకున్నారు.

అయితే… ఈ ముగ్గురినీ స్టాండ్ బై ఆట‌గాళ్లుగా బీసీసీఐ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌క‌ప్ అనేది సుదీర్ఘ టోర్నీ. ఈమ‌ధ్య‌లో ఆట‌గాళ్లెవ‌రైనా స‌రే గాయాల‌పాల‌య్యే అవ‌కాశం ఉంది. అలాంట‌ప్పుడు స్టాండ్ బై ఆట‌గాళ్ల సేవ‌లు వినియోగించుకుంటార‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ఉన్న 15మందిలో ఎవ‌రైనా గాయ‌ప‌డితే… ఆ స్థానంలో వీళ్ల‌లో ఒక‌రిని జ‌ట్టులోకి తీసుకుంటారు. ఓర‌కంగా రాయుడు, పంత్‌ల‌కు ఇది ఊర‌ట‌నిచ్చే విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close