సుభాష్ : ప్రేక్షకులంతా ఓటర్లే..కానీ ఓటర్లంతా ప్రేక్షకులు కాదు..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకు సినిమాలకు అవినావసంబంధం ఉంది. సినీతారలు తమ ప్రజాభిమానాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం మాత్రమే కాదు.. ఆ రాజకీయాల్ని .. మార్చేలా.. ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగేలా సినిమాలు తీయడం కూడా.. ఇండస్ట్రీ చేస్తూంటుంది. ఇప్పుడు రిలీజయ్యే ప్రతీ పెద్ద హీరో సినిమాలో సందర్భం ఉన్నా లేకపోయినా.. కొన్ని పొలిటికల్ డైలాగులుంటాయి. ఒక వేళ లేకపోయినా… ఆ సినిమాలో ఏదో ఓ డైలాగుని రాజకీయ పరిస్థితులకు అన్వయించుకునే పరిస్థితి వచ్చింది. కానీ పూర్తి రాజకీయ కథాంశాలతో తీస్తున్న సినిమాలు..ఎవర్నీ ఆకట్టుకోవడం లేదు.

పొలిటికల్ సినిమా అట్టర్ ఫ్లాపే..!

రాజకీయ పార్టీలను గురి పెట్టి..ఆర్జీవీ ఎన్నికలకు ముందు ఒకటి… తర్వాత ఒకటి సినిమాలు తీశారు. ఆ రెండు.. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలోకడప బిడ్డలు. ఆయన సృష్టించే హడావుడి.. వివాదాల దెబ్బకు.. ఆ సినిమాలపై కోర్టుల్లో పిటిషన్లు పడి.. విడుదల కూడా..కష్టమవుతుంది. నిజానికి అలాంటి పరిస్థితి వచ్చిన సినిమాపై సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడుతుంది. అయితే.. విచిత్రంగా.. రామ్ గోపాల్ వర్మ ఇలా … విడుదల చేసిన రెండు సినిమాలు లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు…. రిలీజ్ రోజు మార్నింగ్ షోకే తేలిపోయాయి. అసలు టాకేంటి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మారిపోయాయి. ఫలితం.. ఆ సినిమాలు రిలీజయ్యాయా.. అని రెండు వారాల తర్వాత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.

రాజకీయ కార్యకర్తలు.. సినిమాలకు రావడం లేదు..!

ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తీస్తున్నారు కాబట్టి.. తమ అభిమాన పార్టీకి వ్యతిరేకంగా ఆర్జీవీ ఏం చూపించాడో చూడటానికి ఆ పార్టీ సానుభూతిపరులు, ఎంత వ్యతిరేకంగా చూపించారో చూసి ఆనందించడానికి ఇతర పార్టీల సానుభూతిపరులు వస్తారని… ఇలా రెండు విధాలుగా.. జనం వస్తారని.. ఆర్జీవీ లాంటి ఫిల్మ్ మేకర్స్ ఆశిస్తారు. ఎందుకంటే.. పెద్దల హీరోల సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. పెద్ద హీరో ఫ్యాన్స్ మాత్రమే మొదటి రోజు .. చూడరు. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మొదటి రోజే.. చూస్తారు. అందుకే అంత కలెక్షన్స్ వస్తాయి. ఇదే ఫార్ములా పొలిటికల్ మసాలా సినిమాలకూ వర్కవుట్ అవుతుందని.. కొంత మంది భావించి.. సినిమాలు తీస్తున్నారు. కానీ… సినిమాహీరోల ఫ్యాన్స్ ఫార్ములా … రాజకీయ రాజకీయ పార్టీలకు కార్యకర్తలకు వర్కవుట్ కావడం లేదు. సినిమాలపై ఆసక్తి ఉన్నవారే.. సినిమాకు వస్తున్నారు. ఆ సినిమా…సినిమాగా లేదని తెలిసి.. దర్శకుడ్ని తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు.

పొలిటికల్ సినిమా అయినా .. సినిమాలా ఉండాల్సిందే..గురూ..!

సినిమా అభిమానులు అందరూ ఓటర్లు అవుతారు. కానీ ఓటర్లు అందరూ సినిమా ఫ్యాన్స్ కారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న సినిమా ఫ్యాన్స్ మాత్రమే.. ఆయా సినిమాలను చూసేందుకు కనబరుస్తున్నారు. ఇతరులు మాత్రం.. వెళ్లడం లేదు. అలా వెళ్లినవాళ్లు కూడా.. దాన్ని రాజకీయ చిత్రంగా చూడటం లేదు. దానిలోని పాత్రలను.. నిజ జీవిత రాజకీయాలకు అన్వయించుకోవడం లేదు. తమ అభిరుచి మేరకు.. సినిమా చూసి.. రివ్యూ చేసుకుంటున్నారు. చెత్త సినిమా అని తేల్చేస్తున్నారు. ఫలితంగా… ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా సినిమా ఉన్నా.. ఆ రాజకీయ పార్టీ సానుభూతిపరులు కూడా ధియేటర్‌కు వెళ్లడం లేదు. ఫలితంగా.. సినిమా డిజాస్టర్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close