క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్ కన్ఫ్యూజన్ ఇచ్చాయా?

ఎట్టకేలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. లగడపాటి సహా, అనేక సంస్థలు కూడా వారి వారి విశ్లేషణలను, అంచనాలను వెలువరించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈసారి ప్రజా నాడి ఎటువైపు ఉంటుందో అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ వస్తే కాస్త క్లారిటీ వస్తుంది అనుకున్న జనాలకు క్లారిటీ రాకపోగా మరింత కన్ఫ్యూజన్ వచ్చినట్లుగా కనిపిస్తోంది.

లగడపాటి సర్వే తెలుగుదేశం పార్టీకి ఇంచుమించు 100 స్థానాలను, అలాగే వైఎస్ఆర్సీపీకి ఇంచుమించు 72 స్థానాలను ఇస్తే, ఇండియా టుడే టీడీపీకి కేవలం 40 స్థానాలను, వైఎస్ఆర్ సీపీకి 130 స్థానాలను ఇచ్చింది. ఇక మిగతా అన్ని చానల్స్ లో లగడపాటి సర్వే ఫలితాలు ప్రసారం అవుతున్న సమయంలో సాక్షి ప్రసారం చేసిన ఆరా సర్వే వైఎస్ఆర్ సీపీకి 130 కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ సుమారు 54 స్థానాలను టిడిపికి, 111 కు పైగా స్థానాలను వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టింది. అలాగే వేణుగోపాల రెడ్డి కి చెందిన సి పి ఎస్ సర్వే కూడా వైఎస్సార్సీపీ కి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎలైట్ అనే మరొక సంస్థ టిడిపికి సుమారు 106 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కేకే సర్వే వైఎస్ఆర్సిపి 130 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

లోక్ సభ ఫలితాల విషయంలో కూడా ఇదే సరళి కొనసాగింది. టుడే చాణక్య టిడిపికి 17 ఎంపీ సీట్లను అంచనా వేస్తే, లగడపాటి కూడా టిడిపికి సుమారుగా 15 ఎంపి స్థానాలు వస్తాయని అంచనా వేశారు. రిపబ్లిక్ సీ ఓటర్ 14 లోక్ సభ స్థానాలు టిడిపికి వస్తాయని అంచనా వేస్తే, యాక్సిస్ పోల్ వైఎస్ఆర్సీపీకి సుమారు 18 ఎంపీ స్థానాలను అంచనా వేసింది. అలాగే టైమ్స్ నౌ కూడా వైఎస్సార్ సీపీకి దాదాపు 18 స్థానాలను అంచనా వేసింది.

ఇలా సగం సర్వేలు టిడిపి ఆధిక్యాన్ని ఊహిస్తే, ఇంకొక సగం సర్వేలు వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఊహిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్, కన్ఫ్యూజన్ ఇచ్చాయని జనం అనుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మరో నాలుగు రోజులపాటు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com