ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు. అలాగే ఆనంద్ దేవరకొండ, మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ కలిసి నెట్ ఫ్లిక్స్ కి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా బడ్జెట్ 23 కోట్లు. బేసిగ్గా ఆనంద్ దేవరకొండ లాంటి హీరోలతో దాదాపు 12 కోట్ల లోపే సినిమా అయిపోతుందని భావన ఇండస్ట్రీ వర్గాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. రేమ్యునిరేషన్ కూడా దాదాపుగా నాలుగు కోట్ల వరకు ఉందని టాక్.
ఇప్పుడు ఆనంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇంకా నిర్మాతలు వెంటపడుతున్నారు. ఆనంద్ కి బేబీ లాంటి హిట్టు ఉంది. అయితే అది సోలో హిట్ అనలేము. ఎందుకంటే దానికి నిర్మాత ఎస్ కే ఎన్, డైరెక్టర్ సాయి రేజేష్, కంటెంట్ అన్ని కలిపి ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేశాయి. ఆ సినిమా తర్వాత ఆనంద్ నుంచి వచ్చిన జై గణేశా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు 25 కోట్లతో సినిమా అంటే మామూలు విషయం కాదు. మార్కెట్ కి బడ్జెట్ కి బ్యాలెన్స్ అవుతుందా అనే చర్చ నడుస్తుంది.