ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దృక్పథాన్ని, విధానాలను ప్రశంసించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు సులభతరమైన వాతావరణం కల్పించేందుకు ‘ఎస్క్రో సిస్టమ్’ను ప్రవేశపెడతామని ప్రకటించారు. రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకుని, ప్రతి పెట్టుబడిదారుకు హామీ ఇచ్చిన ఇన్సెంటివ్స్ను తక్షణమే చెల్లించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న మహీంద్రా చంద్రబాబును ప్రశంసించారు. “ఈ మనిషి తిరుగులేని శక్తి… దశాబ్దాలుగా ఆయన అభివృద్ధి విధానాలకు అకర్షితుడ్ని అవుతున్నారు. కొత్త, ముందుకు తీసుకెళ్లే విధానాలు మాత్రమే కాకుండా, తాను, తన చుట్టూ ఉన్నవారందరి ప్రమాణాలను ఎప్పుడూ పెంచుతూ ఉంటారు” అని ప్రశంసించారు. ఈ పోస్టు వైరల్ అయింది. మహీంద్రా గ్రూప్ చైర్మన్‌గా, భారతదేశీయ పారిశ్రామిక రంగంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఆయన అభిప్రాయాలు ఎప్పుడూ చర్చనీయాంశాలు ఉంటాయి.
ఆనంద్ మహింద్రా ప్రశంసలపై చంద్రబాబు స్పందించారు. భారతదేశం అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాననని… మన బాధ్యత నిరంతరం నూతన ఆవిష్కరణలు చేయడమన్నారు. ప్రజల విస్తారమైన వ్యవస్థాపక శక్తిని అన్‌లాక్ చేయడానికి కొత్త మార్గాలను సృష్టించాల్సి ఉందన్నారు. నేను ఈ ప్రయత్నంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాననని చంద్రబాబు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా మీ మద్దతు మరియు భాగస్వామ్యం అమూల్యమైనవి. త్వరలో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడానికి నేను ఎదురు చూస్తున్నాననని .. పెట్టుబడుల విషయంలో తగ్గేది లేదని హింట్ ఇచ్చారు.


