నిన్న పల్లెటూరి అమ్మాయిగా.. ఈరోజు పోలీస్‌ ఆఫీసర్‌గా!

టి.వి. యాంకర్‌గా తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా లేటెస్ట్‌గా కింగ్‌ నాగార్జునతో కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో ఓ క్యారెక్టర్‌ చేసిన అనసూయ ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌గా కొత్త గెటప్‌లో కనిపించబోతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో అందర్నీ అలరించిన అనసూయ ఇప్పుడు రివాల్వర్‌ చేత పట్టుకొని శత్రువులను వేటాడే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. పివిపి సినిమా పతాకంపై రవికాంత్‌ దర్శకత్వంలో అడవిశేష్‌, అదాశర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘క్షణం’ చిత్రంలో అనసూయ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.
కొత్త గెటప్‌లో రివాల్వర్‌ పట్టుకొని ఫోజులివ్వడం కాకుండా ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి అనసూయ చాలా హోమ్‌వర్క్‌ చేసిందట. చాలామంది పోలీస్‌ ఆఫీసర్లను కలుసుకొని తనకు తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకొని వాటిని తను చేస్తున్న క్యారెక్టర్‌ కోసం ఉపయోగించుకుంది. ఆమె పెర్‌ఫార్మెన్స్‌ని యూనిట్‌లోని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారట. ‘క్షణం’ చిత్రంలో అనసూయ చేస్తున్న ఈ క్యారెక్టర్‌ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకుంటుందని యూనిట్‌ సభ్యులు చెప్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జిల్లాల విభజన చేయబోతోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో... ఏపీలో రాజకీయ నేతలు ఎవరి డిమాండ్లు వారు వినిపించడం ప్రారంభించారు. వీరి జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...

ఏపీ సర్కార్ రూ. 65వేల కోట్ల “ప్రైవేటు” అప్పు…!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రెస్‌నోట్ ద్వారా మీడియాకు చెప్పారు. కానీ.....

విశాఖలో మరో “ఫార్మా ఫైర్”..! ఎందుకిలా..?

విశాఖలో అర్థరాత్రి మరో భారీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రత్యేకంగా కెమికల్స్ తయారు చేసి.. ఇతర ఫార్మా కంపెనీలకు విక్రయించే... విశాఖ సాల్వెంట్స్ సంస్థలో ప్రమాదం జరింది. ఫ్యాక్టరీ మొత్తం కెమికల్స్‌తో...

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

HOT NEWS

[X] Close
[X] Close