తనపై సెటైర్‌లమీద స్పందించిన ఓంకార్ అన్నయ్య

హైదరాబాద్: తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ రంగంలో ఓంకార్‌ది ఒక భిన్నమైన శైలి. ఎంతమంది వెక్కిరించినా, విమర్శలు చేసినా అదే శైలితో అతను అనేక విజయాలు సాధించాడు. తర్వాత సినిమా రంగంలోకి… అదీ నేరుగా దర్శకత్వ విభాగంలోకి ప్రవేశించాడు. మొదట ‘జీనియస్’ అనే సినిమాను రూపొందించాడు. అది ఫెయిలయింది. అయినా నిరుత్సాహపడకుండా ఈసారి స్వీయనిర్మాణంలో ‘రాజుగారి గది’ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఇటీవల బాగా విజయవంతమైన కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్ర ట్రైలర్ భిన్నంగా, టాలీవుడ్‌లోని అనేక మంది ప్రముఖులతో బైట్‌లతో రూపొందించటం విశేషం. ఈ సందర్భంగా వివిధ మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూలలో తనపై అనేక సినిమాలలో, స్టేజ్‌షోలలో వచ్చిన సెటైర్‌లపై ఓంకార్ స్పందించాడు. తన శైలిని పేరడీ చేయటాన్ని తనకు లభిస్తున్న గౌరవంగా భావిస్తానని చెప్పాడు. ప్రముఖ హీరోల శైలినే సినిమాల్లో పేరడిగా చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటానన్నాడు. రాజుగారి గది చిత్రంలో నటించిన కమెడియన్‌లు షకలక శంకర్, ధన్‌రాజ్ ఈ చిత్రం షూటింగ్‌లో ఎన్నోసార్లు తనను అనుకరిస్తూ కామెడీ స్కిట్‌లు చేశారని చెప్పాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close