అప్పు అభివృద్ది : ఒక్క ఏప్రిల్‌లోనే రూ. 20వేల కోట్లు..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రుణాలివ్వడానికి ఎవరూ వెనక్కితగ్గడం లేదు. పరిమితికి మించి అప్పులు చేసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. అటు కేంద్రమూ భూరి రుణాలిస్తోంది. బ్యాంకులు కూడా ఇటు గవర్నర్‌ను హామీగా పెట్టినా సరే.. “ఎంత కావాలి..?” అనే సింగిల్ డైలాగ్‌ను చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడాదిలో ఏపీ సర్కార్ కొంచెం తక్కువగా రూ. ఇరవై వేల కోట్ల అప్పులు చేసిందని… ఈ లెక్కలన్నీ చూసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్.. తాజా లెక్కలు విడుదల చేసింది. స్పష్టంగా చెప్పుకోవాలంటే.. ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా చేసిన అప్పు రూ.19,717 కోట్లు. అన్ని మార్గాలు అంటే.. ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేయడం.. బ్యాంకుల నుంచి సేకరించడం.. ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడం వంటి వన్నమాట.

బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం ఏడాది మొత్తం తాము రూ.37వేల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేయబోమని స్పష్టం చేసింది. అంటే.. సగటున.. రూ. మూడు వేల కోట్లు అన్నమాట. కానీ మొదటి నెలలోనే .. మొత్తం ఏడాదిలో చేస్తామని చెప్పిన అప్పుల్లో యాభై శాతానికిపైగా చేసేశారు. ఎవరైనా ఆదాయానికి మించి అప్పులు చేయరు. అలా చేయడం దివాలా కిందకు వస్తుంది. ప్రస్తుతం ఏపీ ఆ పరిస్థితి చేరింది. ఏప్రిల్ నెల మొత్తం.. పన్నులు.. కేంద్ర సాయం ద్వారా అందింది… రూ. 11, 600 కోట్లు. ఇందులో ఏపీకి నికరంగా ఉన్న ఆదాయం రూ. ఏడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే. ఈ మాత్రం ఆదాయానికి.. నెలకు రూ. ఇరవై కోట్ల అప్పు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఇది ఏప్రిల్ లెక్కలే. మే లెక్కలను ఇంకా విడుదల చేయలేదు. నిజానికి మేలో పెద్దగా అప్పులు దొరకలేదు. అందుకే.. జూన్ ప్రారంభంలో ఉద్యోగులకు జీతాలకు ఇబ్బంది ఎదురయింది. జూన్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇంకా స్పష్టత రాలేదు. రుణాల కోసం… వచ్చే డిసెంబర్ – మార్చి మధ్య తీసుకోవాల్సిన రుణాలు ఇప్పుడే తీసుకునేలా పర్మిషన్ ఇవ్వాలన్న విజ్ఞప్తితో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పనిగా ఢిల్లీలో కేంద్ర పెద్దలందర్నీ కలిశారు. వర్కవుట్ అయిందో లేదో.. రేపు ఉద్యోగులకు జీతాలు.. పెన్షన్లు..సామాజిక పెన్షన్లు వంటి వాటికి చెల్లింపుల ద్వారా తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close