రాహుల్ అభ్యర్థిత్వానికి మమతా ఓకే..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఓడించడానికి అందరూ ఏకమవ్వాల్సిన అవసరాన్ని మమతా బెనర్జీ ఎట్టకేలకు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం ఆమె.. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేసే విషయంలో రిజర్వేషన్లను పాటిస్తున్నారు. అవసరం అయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారు. దీంతో విపక్షాల మధ్య ఐక్యత లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ తర్వాత ఆమె.. మాటల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. బీజేపీపై పోరాడేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ సాయం చేయాలనుకుంటున్నాను కానీ నాయకత్వం వహించాలనుకోవడం లేదని ప్రకటించారు.

ఎవరు నేతృత్వం వహించినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు నిర్ణయిస్తామన్నారు. అయితే తానేమ పట్టుబట్టనని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. అందరి ఆమోదంతోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి కాబట్టి.. తనకు అభ్యంతరం లేదని తెలిపారు. శరద్ పవార్‌తో పాటు మరికొంత మంది ప్రాంతీయ పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించి.. వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా మార్చే అవకాశం ఉంది.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నారు. విపక్షాలకు.. కూడా.. కాంగ్రెస్ తో కలిసి పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని… ధర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదని వివరిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అయితే..తాను కాంగ్రెస్ కోసం పని చేసేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ తురణంలో మమతా బెనర్జీలో మార్పు.. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేన వైపు బాలినేని చూపు !?

జగన్ బంధువు .. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి తరపు బంధువు కావడంతో ఆయనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా...

మహేష్ బర్త్ డే.. పవన్ స్పెషల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుతున్నారు....

“ఖైదీల” కోసం వైఎస్ఆర్‌సీపీ !

వైసీపీ నేతలు ఖైదీల కోసం ఆరాట పడుతున్నారు. గత వారం జైల్లో ఉన్న ఎంపీలకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఓ ప్రైవేటు బిల్లును ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో...

ఇక ఏపీలో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ !

ఏపీలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే తవ్వకాలు చేసుకోవచ్చని నేరుగా చెప్పడమన్నమాట. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close