అమ్మేసే అధికారం ఉంటే అమ్మేయాల్సిందేనా..!?

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదన అందర్నీ విస్మయ పరుస్తోంది. తమకు అమ్మేసే అధికారం ఉందని.. తమ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని.. ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని.. అది చట్టబద్ధమైన అధికారాలతో తీసుకున్న నిర్ణయమని తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో ఆయన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది.

ఇందులో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. ఇలాంటి నిర్ణయాలపై విచారణ తగదని అఫిడవిట్‌లో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వీవీ లక్ష్మినారాయణ చురుగ్గా పాల్గొంటున్నారు. ఉద్యమకారులకు మద్దతు తెపుతున్నారు. మొదట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో అనేక కీలకమైన అంశాలను పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రం విశాఖ ఉక్కుపై 5 వేల కోట్లు ఖర్చు చేసిందని.. కానీ 30 వేల కోట్లు టాక్స్ రూపంలో వసూలు చేసిందని లక్ష్మినారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. వీవీ లక్ష్మినారాయణ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై స్పందించలేదు. స్టీల్ ప్లాంట్ దేనికి అమ్ముతున్నారో… అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుందో.. అసలు ఎంత ఖర్చు పెట్టారు.. ఎంతకు అమ్ముతున్నారన్నదానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. కానీ.. అమ్మడానికి అధికారం ఉందని మాత్రం తేల్చి చెబుతోంది. అమ్మే అధికారం ఉందని అమ్ముతున్నాం కానీ.. అసలు అమ్మాల్సిన అవసరం ఏమిటనేది.. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో లేకపోవడం.. చర్చనీయాంశం అవుతోంది. పైగా ఆయనకు రాజకీయ ఉద్దేశాలు అంటగట్టారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకుని చాలా కాలం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close