కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మెగా డీఎస్సీ పేరుతో జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నిరుద్యోగుల్ని మోసం చేస్తే వచ్చిన ఏడాదిలోనే పదమూడువేలకుపైగా టీచర్ పోస్టులను టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసింది.ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేస్తోంది. ఆరు వేల మందికి నియామక పత్రాలను చంద్రబాబు ఇవాళ అందించనున్నారు.
ఆరువేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖలో నూతన కానిస్టేబుల్స్‌గా ఎంపికైన 6,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందిస్తున్నారు. ఇందు కోసం మంగళగిరి పోలీస్ బెటాలియన్ లో ప్రత్యేకమైనఏర్పాట్లు చేశారు. ఈ సారి అందరికీ పండుగ వాతావరణంలో నియామకపత్రాలు అందిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన తర్వాత పోలీసు ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారు. ఈ ట్రైనింగ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది.
త్వరలో మరో ఐదు వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నియామక ప్రక్రియ 2025 ఏడాదికి 11,639 పోస్టులకు కానిస్టేబుల్స్ , సబ్-ఇన్స్పెక్టర్లు సంబంధించినది. ఈ ప్రక్రియలో భాగంగా 6,000 మంది కానిస్టేబుల్స్‌కు ఎంపిక పూర్తి అయింది. రిటన్ టెస్టుతో పాటు ఫిజికల్ టెస్టులు సహా మొత్తం ఐదు అంచెల్లో జరిగిన పోటీ పరీక్షలను నెగ్గి వీరు ఉద్యోగం సాధించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా DSC తోపాటు ఇది రెండో పెద్ద ఉద్యోగ నియామకం. ఈ 6,000 కానిస్టేబుల్స్ ద్వారా పోలీసు శాఖలో మాన్పవర్ పెరిగి, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్‌కు బలం చేకూరుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఈ కానిస్టేబుల్స్ వివిధ జిల్లాల్లో డ్యూటీల్లో చేరుతారు. రాష్ట్ర ప్రభుత్వం 2025లో మరో 5,000 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించనుంది.
అర్హత ఇంటరే అయినా ఎంపికైన వారిలో పోస్ట్ గ్రాడ్యూయేట్స్
కానిస్టేబుల్స్ కు శిక్షణ తొమ్మిది నెలల పాటు ఉంటుంది, మొదటి దశ నాలుగున్నర నెలలు ఉంటుంది, తరువాత ఒక వారం సెలవు, రెండవ దశ శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులలో గణనీయమైన సంఖ్యలో ఉన్నత విద్యావంతులైన యువత ఉన్నారు. 810 మంది అభ్యర్థులు బిటెక్, ఎంటెక్ బిసిఎ వంటి సాంకేతిక అర్హతలను కలిగి ఉన్నారు. కనీస అర్హత ఇంటర్మీడియట్ అయినప్పటికీ, ఎంపికైన అభ్యర్థులలో దాదాపు 67.35 శాతం మంది గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వీరిలో ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సీ డిగ్రీలు ఉన్నవారూ ఉన్నారు.
