ఆంధ్రప్రదేశ్‌లో రప్పా రప్పా బ్యాచ్‌ను పోలీసులు రఫ్పాడిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలం కాబట్టి ఏమైనా చేస్తామని రప్పారప్పా నరికేస్తామని అంటే.. పోలీసులు వెంటనే షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు నారా లోకేష్ కూడా హెచ్చరికలు ఇచ్చిన గంటల్లోనే పోలీసులు ఇలాంటి బెదిరింపులు ఇచ్చే వారిని, దాడులు చేసే వారికి షాక్ ట్రీట్ మెంట్ ప్రారంభించారు.
వీధుల నుంచి నడిపించుకుటూ తీసుకెళ్తున్న పోలీసులు
కొంతకాలంగా వైసీపీ కార్యకర్తలకు రప్పా రప్పా బెదిరింపులు కామన్ అయిపోయాయి. నరికేస్తామంటూ పోస్టర్లు వేస్తున్నారు. ఈ రాజకీయ ఉన్మాదానికి పోలీసులు చెక్ పెడుతున్నారు. అధికారం అండతోనో, రాజకీయ పార్టీల ముసుగులోనో సామాన్యులను ఇబ్బంది పెట్టేవారి పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో జగన్ పుట్టినరోజు సందర్భంగా పటాసులు కాల్చే విషయంలో అభ్యంతరం చెప్పారని ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా, కడుపుపై తన్నిన ఉన్మాది అజయ్ దేవా అనే వ్యక్తిని పోలీసులు కదిరి వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నడుస్తున్న వ్యక్తి పరిస్థితి చూసి అందరూ సరిగ్గా జరిగిందని అనుకున్నారు.
రప్పారప్పా పోస్టర్లు వేసే వారిపై కేసులు
జగన్ పుట్టిన రోజు సందర్బంగా రప్పా రప్పా పోస్టర్లు వేసి.. జంతువుల్ని బలి ఇచ్చి ఆ రక్తంతో పోస్టర్ పై అభిషేకం చేసిన ఓ వైసీపీ సర్చంచ్ కూ అదే ట్రీట్ మెంట్ ఇచ్చారు. అరెస్టు చేసి నడిపింంచుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ఓ ఊళ్లో ఇంటర్, టెన్త్ పిల్లలతో రప్పా రప్పా పోస్టర్ పెట్టించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. ఇలాంటి పోస్టర్లు ప్రింట్ చేసే ఫ్లెక్సీ మిషన్లను సీజ్ చేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి సైకోలకు గట్టి బుద్ది చెప్పడం ఖాయమని ఈ ఘటనలు నిరూపించాయి. నేరం చేయడానికి భయపడేలా ఒక వాతావరణాన్ని సృష్టించడంలో ఏపీ పోలీసులు సక్సెస్ అవుతున్నారు. రప్పారప్పా బ్యాచ్ గా మారిన అరాచక శక్తులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు.
వీరందరూ ఇలా దారితప్పడానికే వైసీపీనే కారణం
క్యాడర్ ను అరాచకశక్తులుగా మార్చే క్రమంలో రప్పా రప్పా పోస్టర్లు వేయాలని వైసీపీ నాయకత్వమే ప్రోత్సహిస్తోంది. రప్పా రప్పా నరికేస్తాం అంటే తప్పు కాదని సజ్జల లాంటి వాళ్లు చెబుతున్నారు. అలాంటి పోస్టర్లు వేయాలని సందేశాలు కూడా పంపుతున్నారు. ఇలా చేసి కేసులు, జైళ్ల పాలవుతున్న వారిని వైసీపీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. వారి కుటుంబాలు తల్లిఢిల్లీపోతున్నాయి.. వైసీపీ నాయకత్వం మరికొంత మంది బకరాలను వెదుక్కుంటోంది.
