ఆస్తుల విలువ పెరుగుదల అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి. మనం పెట్టే పెట్టుబడికి ఆదాయం ఎంత వస్తుంది… ఆస్తి విలువ ఎంత పెరుగుతుందన్నదాన్ని బట్టి మన సంపద కూడా ఉంటుంది. అందుకే చాలా మంది రియల్ ఎస్టేట్ లో భవిష్యత్ ట్రెండ్స్ ను చూసుకుని పెట్టుబడులు పెడతారు.
వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల పాటు ఏపీలో ఆస్తుల విలువలో పెరుగుదల లేదు. కొన్ని చోట్ల తగ్గిపోయాయి. ఒక్క అమరావతిలోనే కాదు.. మొత్తంగా అలాంటి పరిస్థితే ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది కానీ.. ధ్వంసం చేసిన అమరావతిని మళ్లీ నిర్మించడం సాధ్యమేనా అన్న అనుమానాలతో బూత్ అయితే రాలేదు. కానీ లావాదేవీలు మాత్రం పెరిగాయి.
ఇప్పుడు అమరావతి పట్టాలెక్కుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించనుంది. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకూ భూముల ధరలు పెరుగుతాయి. అమరావతి రాష్ట్రానిది. అది ఎంత బలంగా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాజిటివ్ వైబ్స్ కనబడతాయి. కానీ కొన్ని చోట్ల ప్రచారాలు జరుగుతాయి. మరికొన్ని చోట్ల సైలెంటుగా గా వృద్ధి కనిపిస్తుంది. ఎలా అయినా అమరావతి రాష్ట్రం మొత్తం విలువను పెంచే ఓ గేమ్ ఛేంజర్ అనుకోవచ్చు.