మ‌హేష్ ప్ర‌పోజ‌ల్‌కి ‘నో’ చెప్పిన ద‌ర్శ‌కుడు

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ త‌ర‌వాత మ‌హేష్ బాబు సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ క్లారిటీ రాలేదు. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల్సివున్నా, అది ఆగిపోయింది. ప‌ర‌శురామ్ లైన్‌లోకి వ‌చ్చినా… ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోకి.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు క‌రువ‌వ్వ‌డం విచిత్ర‌మైన ప‌రిస్థితే. ద‌ర్శ‌కులంతా ఎవ‌రి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉండ‌డం వ‌ల్ల.. మ‌హేష్ స్థాయికి త‌గిన ద‌ర్శ‌కుడెవ‌రూ దొర‌క‌లేదు.

ఈలోగా.. మ‌హేష్ అనిల్ రావిపూడి ముందు ఓ ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ట‌. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లానే.. వీలైనంత త్వ‌ర‌గా ముగించేసే ప్రాజెక్టు ఏదైనా తీసుకుర‌మ్మ‌న్నాడ‌ట‌. ‘స‌రిలేరు…’ త‌ర‌వాత అనిల్‌తో మ‌రో సినిమా చేస్తాన‌ని మ‌హేష్ మాటిచ్చాడు. ఎలాగూ.. `ఎఫ్ 3`కి స‌మ‌యం ఉంది క‌దా, ఈలోగా త‌న‌తో సినిమా తీయొచ్చు క‌దా… అన్న‌ది మ‌హేష్ ఆలోచ‌న‌. అయితే ఈ ప్ర‌పోజ‌ల్‌కి అనిల్ రావిపూడి ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. టార్గెట్ పెట్టుకుని సినిమా పూర్తి చేయాల‌నుకుంటే క్వాలిటీ దెబ్బ‌తింటుంద‌ని, ఈసారి మ‌రింత మంచి క‌థ‌తో, మ‌రింత మంచి అవుట్ పుట్ ఇచ్చే సినిమా తీద్దామ‌ని, అందుకోసం కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పాడ‌ట‌. పైగా `ఎఫ్‌3 `కోసం దిల్ రాజుకి అనిల్ రావిపూడి మాటిచ్చేశాడు. అనిల్ రావిపూడి త‌దుప‌రి సినిమా ఏదైనా స‌రే.. దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే చేయాలి. సో.. మ‌హేష్ ఈక్వేష‌న్స్ ఇక్క‌డ పని చేయ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వారధిపై ఆ “హెచ్చరిక ఫ్లెక్సీలు” ఎవరిని ఉద్దేశించి..!?

న్యాయమూర్తులు వెళ్లే దారిలో వైసీపీ నేతలు హెచ్చరికల ఫ్లెక్సీలు పెట్టడం దుమారం రేపుతోంది. తాడేపల్లి వారధిపై రెండు, మూడు రోజులుగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎమ్మెల్యే జోగి రమేష్ ఫోటోలతో ...

బాలు స్వరం వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారా..? నో.. నెవ్వరు..! ఎక్కడ చూసినా ఆయన గొంతే వినిపిస్తూంటే ఆయన లేరని చెప్పడానికి నోరెలా వస్తుంది..?. ఇప్పుడు కాదు..పుట్టినప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి.. రెడియోల్లో పాటలు...

దుబ్బాక రేసు ప్రారంభించేసిన నేతలకు ఈసీ షాక్..!

దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేస్తుందని పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది కానీ ఉపఎన్నికలను నిర్వహించాలని మాత్రం నిర్ణయించుకోలేదు. కొద్ది రోజుల...

క‌న్నీటి ప‌ర్యంత‌మైన సిరివెన్నెల‌

బాలు మృతిని సినీ రంగం జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రీ ముఖ్యంగా.. ఆయ‌న సన్నిహితులు, స్నేహితులు, సాహితీకారులు. బాలుని ప్రేమ‌గా `అన్న‌య్యా` అని పిలుచుకునే సిరివెన్నెల మాత్రం బోరున విల‌పించారు. `తెలుగు సినిమా పాట‌ల మాస్టారు...

HOT NEWS

[X] Close
[X] Close