ప‌వ‌న్ గెట‌ప్‌.. ఫ్యాన్స్ షాక్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌పై సీరియ‌స్‌గానే దృష్టి పెట్టాడు. కానీ లుక్‌ని మాత్రం అశ్రద్ధ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. జ‌న‌తా క‌ర్వ్యూపై స్పందిస్తూ ప‌వ‌న్ ఓ వీడియో వ‌దిలాడు. అందులో ప‌వ‌న్ లుక్ కాస్త అభిమానుల‌కు షాక్ ఇచ్చేట్టే క‌నిపిస్తోంది. ఇదో సీరియ‌స్ మేట‌ర్‌. లుక్కుల గురించి ఆలోచించ‌కూడ‌దు. కానీ.. అభిమానులు ప్ర‌తీదీ సినిమా కోణంలోనే చూస్తుంటారు. హీరో బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా – సినిమాలోని లుక్కుతో బేరీజు వేసుకుంటారు. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ అదే జరుగుతోంది. ఆ వీడియోలో ప‌వ‌న్ మీస‌క‌ట్టు, హెయిర్ స్టైల్ కాస్త మోటుగా ఉన్నాయి. క్రిష్ సినిమాలో ప‌వ‌న్ ఇదే లుక్కుతో క‌నిపించ‌బోతున్నాడు. తెర‌పై కూడా ప‌వ‌న్ ఇలానే ఉంటాడా? అనే సందేహాలు, భ‌యాలూ వ్య‌క్తం అవుతున్నాయిప్పుడు. క‌రోనా ఎఫెక్టుల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. మ‌ళ్లీ ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలీదు. అందుకే ప‌వ‌న్ త‌న లుక్‌పై అశ్ర‌ద్ధ చేసి ఉండొచ్చు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ప‌వ‌న్ కేవ‌లం సినీ న‌టుడే కాదు. సీరియ‌స్ రాజ‌కీయ నాయ‌కుడు కూడా. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక లుక్కులు, డైటుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కాక‌పోతే ప‌వ‌న్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నాడు. లుక్‌ల‌పై కూడా శ్ర‌ద్ధ వ‌హిస్తే మంచిద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close