మీడియా వాచ్‌: ‘స‌న్న‌’గిల్లిన డైలీ పేప‌ర్‌

క‌రోనా ఎఫెక్ట్ ఇప్పుడు మీడియాకీ పాకేసింది. ముఖ్యంగా ప్రింట్ మీడియాకు. వార్త‌ల‌న్నీ క‌రోనా చుట్టూ తిర‌గ‌డం, యాడ్లు ఆగిపోవ‌డంతో డైలీ పేప‌ర్ల పేజీల్ని కుదించ‌డం మొద‌లెట్టారు. ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ‌… ఇలా అన్ని పేప‌ర్లూ పేజీల సంఖ్య‌ని బాగా త‌గ్గించేశాయి. ఈరోజు ఈనాడు డైలీ 12 పేజీలకే ప‌రిమిత‌మైంది. సినిమా, క్రీడా వార్త‌ల‌కు స‌గం పేజీని మాత్ర‌మే కేటాయించారు. నిజానికి సినిమా, క్రీడా పేజీలు లేకుండానే పేప‌ర్‌ని వ‌ద‌లాల‌ని అనుకున్నారు. కానీ… యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకునే ఆ రెండు పేజీలూ లేక‌పోతే.. పేప‌ర్ మ‌రీ బోసిబోతుంద‌ని స‌గం పేజీకి కుదించారు. ప‌రిస్థితి ఇలానే ఉంటే, క‌రోనా స‌ద్దుమ‌ణిగేంత వ‌ర‌కూ సినిమా పేజీని పూర్తిగా వ‌దిలేయాల‌ని యాజ‌మాన్యాలు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close