సంగీత ప్రపంచంలో అనిరుథ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్లూ, సూపర్ స్టార్లూ `మాకు అనిరుథ్ కావాలి` అని పట్టుపడుతుంటారు. పాటలెలా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేస్తాడు. ఎలివేషన్లకు అనిరుథ్ ఇచ్చే బీజియమ్స్ మామూలుగా ఉండవు. పాటల్లో కొత్త తరహా సౌండ్ వినిపిస్తుంటుంది. తన ఆల్బమ్ అంటే ఆడియో కంపెనీలు పోటీ పడుతుంటాయి. అందుకే పారితోషికం పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు అనిరుథ్.
దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకొంటున్న సంగీత దర్శకుడు అనిరుథ్. ఒక్కో సినిమాకీ కనీసం రూ.15 కోట్ల పారితోషికం తీసుకొంటున్నాడని టాక్. ‘పారడైజ్’ సినిమాకు గానూ అనిరుథ్కి రూ.15 కోట్లు ఇచ్చార్ట. ఆ సినిమా ఆడియో రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడుపోయాయి. అలా అనిరుథ్ పై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసినట్టైంది. తమన్ ఒక్కో సినిమాకూ రూ.7 నుంచి 8 కోట్లు అందుకొంటున్నాడని తెలుస్తోంది. దేవిశ్రీ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ‘పుష్ప’తో వచ్చిన రేంజ్ అలాంటిది. దేవిశ్రీ టీమ్ లో ఉన్నాడంటే ఆ ఆడియో రైట్స్ ముందుగానే అమ్ముడైపోతాయి. ఆల్బమ్ లో కనీసం 2 హిట్ సాంగ్స్ అయినా ఉంటాయన్న భరోసా వుంది. ఇది వరకు రెహమాన్ ఆడియో అంటే భలే డిమాండ్ ఉండేది. అది క్రమంగా తగ్గిపోతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రెహమాన్ నుంచి ఇటీవల సరైన పాటే రాలేదు. ఆయన సౌండింగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండొచ్చు గాక, కానీ ఇప్పటి మాస్కి అవి అందనంత దూరంలో ఉంటున్నాయి. అందుకే డిమాండ్ తగ్గింది. అయితే `పెద్ది` కోసం రెహమాన్ మంచి ఆల్బమ్ ఇచ్చినట్టు టాక్. చాలా కాలం తరవాత రెహమాన్ సౌండింగ్ మాస్కి నచ్చేలా, ఈ తరం ఆడియన్స్ మెచ్చేలా ఉండబోతున్నాయని సమాచారం.