కంటెంట్ ఈజ్ కింగ్ అంటుంటారంతా. మరీ ముఖ్యంగా హాస్య భరితమైన చిత్రాలు ఎవర్ గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీతో పాటుగా, సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు అయితే ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఆడియెన్స్‌కు అందించనున్నారు. పవన్ కళ్యాణ్ అనే కొత్త హీరోని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు.
సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, పమ్మి సాయి, మిర్చి కిరణ్… ఇలా కామెడీ పరంగా మంచి తారాగణమే ఉంది. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.