‘జాతిరత్నాలు’ సినిమాతో పాపులారిటీ సంపాదించుకొన్నాడు అనుదీప్. `ప్రిన్స్` కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు విశ్వక్ సేన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించడం అనుదీప్‌కి అలవాటు. రీసెంట్ గా ‘కల్కి’, ‘మ్యాడ్ 2’ చిత్రాల్లో కనిపించాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ `వీరమల్లు` సినిమాలోనూ తను మెరవబోతున్నాడు. ‘వీరమల్లు’కు సంబంధించిన ఓ పాట ఈ రోజు విడుదలైంది. ఈ పాట మేకింగ్ వీడియోలో అనుదీప్ మెరిశాడు. తన గెటప్ కూడా చిత్రంగా ఉంది. బాగా ఫోకస్ చేసి చూస్తే తప్ప… తను అనుదీప్ అని గుర్తు పట్టలేం. అనుదీప్ కేవలం ఈ పాటలో మాత్రమే కనిపిస్తాడా? లేదంటే తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉందా? అనేది ఇంకా తేలలేదు. ఏది ఏమైనా `వీరమల్లు`లో అనుదీప్ ఎంట్రీ మాత్రం కాస్త ఆశ్చర్యపరిచేదే.
జూన్ 12న ‘వీరమల్లు’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈలోగా ప్రమోషన్ల వేగం పెంచింది చిత్రబృందం. ఈరోజు 4వ పాట వచ్చింది. చెన్నైలో ఓ ఈవెంట్ చేస్తున్నారు. ముంబైలో కూడా ఓ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎవర్ని అతిథిగా తీసుకురావాలి? అనే విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ రాజకీయ నేత ప్రీ రిలీజ్ కి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిజినెస్ డీల్స్ కూడా వేగం పుంజుకొన్నారు. ఒకట్రెండు రోజుల్లో థియేట్రికల్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.