‘భాగ‌మ‌తి’ ఫ‌స్ట్ లుక్ : మ‌తిపోయింది అనుష్కా…!

రేపు అనుష్క పుట్టిన రోజు. అందుకే భాగ‌మ‌తి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. పుట్టిన రోజు, అందునా భాగ‌మ‌తి అనే అంద‌మైన పేరు… చూడ‌గానే ముద్దొచ్చేసేలా ఓ మెస్మ‌రైజింగ్ లుక్ తో భాగ‌మ‌తిని చూపిస్తార‌నుకొంటే, చిత్ర‌బృందం షాక్ ఇచ్చింది. సీరియెస్ గెట‌ప్‌, ఓ చేతిలో సుత్తి, మ‌రో చేతికి శిలువ.. ఆ క‌ల‌ర్ కాంబినేష‌న్ వాట‌న్నింటితో ‘భాగ‌మ‌తి’ లుక్ మ‌తి పోగొట్టేసేలా డిజైన్ చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాకి సంబంధించి ఇంత వ‌ర‌కూ ఎలాంటి వివ‌రాలూ బ‌య‌ట‌కు రాలేదు. హిస్టారిక‌ల్ జోన‌ర్‌లో సాగుతుందా, థ్రిల్లరా?? అనేది చెప్ప‌లేదు. ఈ లుక్ చూస్తే మాత్రం థ్రిల్ల‌ర్ అని ఖాయం చేసేసేలా ఉంది. గ్రాఫిక్కుల మ‌హిమో, లేదంటే అనుష్క నిజంగానే త‌గ్గిందో తెలీదు గానీ.. ఇక్క‌డ మాత్రం సూప‌ర్‌, అరుంధ‌తిల‌లో చూసిన అనుష్కనే క‌నిపిస్తోంది. లుక్ ప‌రంగా ఈ మార్పు ఊహించ‌లేదు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ `భాగ‌మ‌తి`పై ఎలాంటి అంచ‌నాలూ లేవు. అస‌లు మాట్లాడుకొన్న‌దే త‌క్కువ‌. ఈ లుక్‌తో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది ఈ ప్రాజెక్ట్‌. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్ సంగీతం అందించాడు. మ‌ది కెమెరా ప‌నిత‌నం, క‌ళా ద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ వేసిన సెట్స్ ఈ చిత్రానికి మ‌రింత వ‌న్నె తెస్తాయని చిత్ర‌బృందం చెబుతోంది. సంక్రాంతి రేస్‌లో ఉన్న ఈ చిత్రం.. జ‌న‌వ‌రి 11న విడుద‌ల అవుతుంద‌ని అంచ‌నా. ఒక‌వేళ అఖిల్ సినిమా డిసెంబ‌రు 22న రాకపోతే.. భాగ‌మ‌తి విడుద‌ల తేదీ మారే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.