ప్ర‌వీణ్ స‌త్తారుకి హీరో దొరికేశాడు

‘గ‌రుడ‌వేగ‌’తో ఎక్కువ‌గా లాభ‌ప‌డింది ఎవ‌రంటే.. క‌చ్చితంగా ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు పేరే చెబుతారు. ఇది నిజంగానే ద‌ర్శ‌కుడి సినిమా. త‌న మార్క్ ప్ర‌తీ ఫ్రేమ్‌లోనూ చూపించాడు ప్ర‌వీణ్‌. ఈ సినిమా చూస్తే.. అగ్ర క‌థానాయ‌కులు సైతం ప్ర‌వీణ్‌తో సినిమా చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. యువ క‌థానాయ‌కులు ముచ్చ‌ట‌ప‌డ‌తారు. గ‌రుడ వేగ ఎఫెక్ట్ అప్పుడే మొదలైపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. యువ క‌థానాయ‌కుడు నితిన్‌… ప్ర‌వీణ్‌తో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే ఈ సినిమాని రూపొందించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని నితిన్ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారానే ప్ర‌క‌టించాడు. గ‌రుడ వేగ‌కి ముందే ప్ర‌వీణ్ నితిన్‌కి ఓ క‌థ చెప్పాడు. నితిన్ కూడా చేసేద్దాం అన్న‌ట్టే మాట్లాడాడు. కానీ.. సినిమా విడుద‌లయ్యేంత వ‌ర‌కూ వేచి చూశాడు. ఇప్పుడెలాగూ.. గ‌రుడ వేగ హిట్ బాణీలోనే న‌డుస్తోంది. అందుకే… ధైర్యం చేసి ఆ ప్ర‌క‌ట‌న ఏదో తానే చేసేశాడు. పుల్లెల గోపీచంద్ జీవిత క‌థ‌ని సినిమాగా రూపొందించ‌బోతున్నాడు ప్ర‌వీణ్‌. 2018లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా నితిన్ సినిమాని మొద‌లెట్టేసే ఛాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.