కొత్తపలుకు : తెలంగాణ ముందు నవ్వుల పాలవుతున్న ఏపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వెనుక.. చంద్రబాబుపై కోపం తప్ప.. ఇంకేమీ లేదని… ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తేల్చారు. చరిత్రలో తెలుగు జాతి సామూహిక ఆత్మహత్యకు … జగన్మోహన్ రెడ్డి కారణంగా నిలువబోతున్నారని.. ఆయన విశ్లేషించారు. అమరావతి విషయంలోనే ఆర్కే ఈ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అసెంబ్లీలోనే స్వాగతించిన జగన్.. ఇప్పుడు మార్చేస్తున్నారు. అమరావతిపై అన్ని రకాల ముద్రలు వేసి.. సర్కార్… వాటిని నిరూపించలేకపోతోందని చెబుతున్నారు. ఆధారాలు లేకపోయినా.. అధికారం చేతిలో ఉండి నిరూపించలేకపోయినా.. ప్రజల్లో వేసిన ముద్ర కారణంగా.. అమరావతి రైతులకు సీమ నుండి మద్దతు లభించడం లేదు. జగన్ నిర్ణయం వల్ల.. ప్రభుత్వం మారితే.. రాజధాని .. సీమకు మారదని గ్యారంటీ ఏమిటన్న ఓ సందేహాన్ని కూడా ఆర్కే తీసుకొచ్చారు. దీని వల్ల నిర్వీర్యమయ్యేది ఏపీనే కానీ.. ఓ కులం కాదని.. ఆయన విశ్లేషించారు.

తెలివిగలవాళ్లు అని స్వయం సర్టిఫికెట్లు పొందిన ఏపీ ప్రజలు.. ఇప్పుడు.. అత్యంత పనికిమాలిన వాళ్లుగా మారిపోయారని.. ఆర్కే.. పరోక్షంగా.. పలు ఘటనలు ఉదహరించి చెప్పేశారు. అందులో ప్రధానంగా తెలంగాణతో పోల్చారు. రాష్ట్ర విభజన జరిగితే.. తెలంగాణ కష్టాల్లో పడుతుందని ఏపీ పాలకులు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ శుభ్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆగమైపోయింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీలో.. వెనుకబడిన జిల్లాలని చెప్పి.. వాటికి ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఆర్కే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం మాత్రమే అభివృద్ధి చెందిందనీ, రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పట్టణీకరణ అసలు జరగలేదనీ పేర్కొన్న జీఎన్ రావు కమిటీ తన సిఫారసులలో ఈ జిల్లాలకు చేసిన న్యాయం ఏమీలేదు.

ఒక పరిశ్రమనో, సంస్థనో ఏర్పాటుచేస్తే స్థానికులకు వందలు, వేలసంఖ్యలో ఉపాధి లభిస్తుంది. హైకోర్టు వల్ల కర్నూలు ప్రజలు సాధించుకున్నది ఏమిటి? రాయలసీమకు జరిగిన న్యాయం ఎక్కడ? .. అని ఆర్కే ప్రశ్నిచారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ప్రజలలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం.. ఆర్కే వ్యక్తం చేశారు. మొత్తానికి ఆర్కే అభిప్రాయాల్లో రాజకీయాల పరంగా పాక్షికత కనిపిస్తుందేమో కానీ.. కొన్ని అంశాల్లో …ఆలోచించతగ్గట్లుగానే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close