ఈ నెల నుంచే ఏపీలో రూ. 2 వేల పెన్షన్..! ఓట్ల వేట ప్రారంభించిన ఏపీ సీఎం..!

ఎన్నికల కోడ్ రాక ముందే.. సంక్షేమ లబ్దిదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి.. రాజకీయలబ్ది పొందే ప్రయత్నంలో.. చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారని.. ప్రకటించారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 54లక్షల మంది పించన్ దారులకు లబ్దిదారులు ఉన్నారు. వీరందరికీ.. సామాజిక భద్రతా పెన్షన్ రెట్టింపు అవుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు…చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది కలగనుంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాక ముందు.. రూ. రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే.. పెన్షన్ రూ. 2వేలు ఇస్తానంటూ.. హామీ ఇచ్చి ప్రచారం చేశారు. దానికి కౌంటర్ గా.. చంద్రబాబు నాయుడు.. పెన్షన్లను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ఈ నెల నుంచే అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పెంచిన పెన్షన్ మొత్తం లబ్దిదారులకు ఒక సారి అందితే.. నమ్మకం కలుగుతుందని.. అది ఓట్లుగా మారుతుందని.. చంద్రబాబు అంచనా. ఫిబ్రవరిలో.. ఎన్నికల షెడ్యూల్ రావడం ఖాయమయింది. ఫిబ్రవరిలో ప్రకటిస్తే.. తొలిసారి పెరిగిన మొత్తం పెన్షన్ ఓటర్లకు పంపిణీ చేయడం ఇబ్బందికరం కావొచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక నెల ముందుగానే చంద్రబాబు పెన్షన్ పెంచడమే కాదు.. పెంచిన మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల్లో.. సంక్షేమ పథకాలు.. వాటి లబ్దిదారులే కీలకంగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు కృతజ్ఞతగా ఓటు వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగిందని… తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే.. జన్మభూమిలో పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెడుతున్నారు. ఇళ్ల ధరఖాస్తు దారులకు మంజూరు పత్రాలు ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. మొత్తానికి.. సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close