వివేకా హ‌త్య కేసులో ద‌ర్యాప్తు ఇంకా జ‌రుగుతోందన్న డీజీపీ..!

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు జ‌రిగిన వైయ‌స్ వివేకానంద హ‌త్య రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన వైకాపా స‌ర్కారు ఈ హ‌త్య కేసుపై త్వ‌ర‌గా ఏదీ తేల్చ‌డం లేద‌నీ, విచార‌ణ‌ను నీరుగార్చే దిశ‌గా సాగుతోంద‌నే ఆరోప‌ణ‌లూ చాలానే ఉన్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే ద‌ర్యాప్తుపై అధికారికంగా ఎప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి అప్ డేట్స్ లేకుండా పోయాయి. అయితే, ఎట్ట‌కేల‌కు వివేకా హ‌త్య కేసు మీద‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ స్పందించారు.

వివేకా హ‌త్య‌పై కొన్ని ఆరోప‌ణ‌లూ క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయనీ, వాటిలో ఎలాంటి వాస్త‌వాలు లేవ‌న్నారు స‌వాంగ్. కేసు విచార‌ణ స‌మ‌ర్థంగా జ‌రుగుతోంద‌నీ, ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్యానాలు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దర్యాప్తు విష‌యంలో పోలీసులు త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతార‌న్నారు. అయితే, ఇప్ప‌టికే కొంత‌మంది ఈ కేసు విచార‌ణ‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు ప్ర‌చారాలు చేస్తున్నార‌నీ, అలా చేస్తున్న‌వారికి నోటీసులు పంపించి వివ‌ర‌ణ కోర‌తామ‌ని స‌వాంగ్ అన్నారు. గ‌డ‌చిన మూడు నెల‌ల్లో వివేకా హ‌త్య కేసులో చాలా చేశామ‌న్నారు. రాజ‌కీయంగా అన‌వ‌సరంగా చేసే వ్యాఖ్య‌లు కేసు ద‌ర్యాప్తును ప్ర‌భావితం చేస్తాయ‌న్నారు.

వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ద‌ర్యాప్తు.. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది! గ‌డ‌చిన మూడు నెల‌లుగా చాలా చేశామ‌ని స‌వాంగ్ చెప్పారు. ఇంత‌కీ, ఈ కేసు విచార‌ణ ఎప్ప‌టిలోగా పూర్త‌వుతుంద‌నేది ఇంకా స్ప‌ష్ట‌త‌లేని అంశంగానే క‌నిపిస్తోంది! చాలా చేసినప్పుడు… ఇంకా చెయ్యాల్సింది ఏముందో ఏమో మ‌రి. ఇంకోటి.. ఈ కేసు నేప‌థ్యంలో వ్యాఖ్యానాలు చేసిన‌వారికి నోటీసులు పంపుతామ‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌తోపాటు, అధికార పార్టీ నేత‌లు కూడా చాలానే వ్యాఖ్యానాలు చేశారు క‌దా! ఇది రాజ‌కీయ హత్య అని టీడీపీ నేత‌లు అంటుంటే… వివేకా హ‌త్య‌కు కుట్ర చేసిందే గ‌త చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారు అంటూ ఆ మ‌ధ్య చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. డీజీపీ వ్యాఖ్య‌ల ప్ర‌కార‌మైతే ఇవ‌న్నీ కేసు ద‌ర్యాప్తును ప్ర‌భావితం చేసే అంశాల‌వుతాయి క‌దా! మొత్తానికి, కేసు ద‌ర్యాప్తు స‌మ‌ర్థంగా, ప‌టిష్టంగా, బ‌లంగా, ఇంకా ఇంకా జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేయ‌డం జ‌ర‌గింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close