సీఆర్డీఏ రియల్ ఎస్టేట్ షురూ.. సంక్రాంతి నుంచి స్థలాల అమ్మకాలు !

సీఆర్డీఏను రద్దు చేసి.. మళ్లీ వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జోరుగా ఆ సంస్థతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. హ్యాపీనెస్ట్ లాంటి ప్రాజెక్టును పక్కన పెట్టేసి..కోర్టు కేసులు ఎదుర్కోవడానికి కూడా రెడీ అన్నట్లుగా ఉన్న ప్రభుత్వం… ఇప్పుడు సీఆర్డీఏతో స్థలాలను అమ్మాలని నిర్ణయించింది. దీనికి స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం అని పేరు పెట్టారు. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌ పేరుతో 600 వరకు ప్లాట్లను అమ్మకానికి పెట్టారు.

ఒక్కొక్కటి 200 చ.గజాల నుంచి 240 చ.గజాల వరకు ఉంటుంది. కుటుంబ సభ్యుల అందరి ఆదాయం సంవత్సరానికి రూ.18 లక్షల లోపు ఉండి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఇక్కడ కొనుగోలు చేయాలి. ఆదాయాన్ని ధ్రువీకరించే ఐటీ రిటర్నులు, ఫారం16, తహశీల్దారు జారీ చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో విలువలో 10 శాతం చెల్లించాలి. కేటాయింపు అయిన నెలలోపే ఒప్పందం చేసుకోవాలి… ఆ తర్వాత నెలలోగా 30 శాతం, 6 నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ.. రిజిస్ట్రేషన్‌ సమయంలో కాని మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.

ధర ఎంత అన్నది ఫైనల్ చేయలేదు. ఎలా ఫైనల్ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఈ టౌన్ షిప్ ప్రాజెక్టును పదమూడో తేదీన జగన్ ప్రారంభిస్తారు. ఇది నేరుగా ప్రభుత్వ స్థలాల అమ్మకం అని.. బిల్డ్ ఏపీ రూపు మార్చి ఇలా చేస్తున్నారని విపక్షాలంటున్నాయి. అయితే అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయని వైసీపీ స్థలాలను ఎలా అమ్ముతుందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close