ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి గాడిలో పడటానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. భవన నిర్మాణ , లేఅవుట్ ఆమోదాల సరళీకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ, అమరావతి అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, భూ వివాదాల తగ్గింపు వంటి అనేక చర్యలు తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన నియమాలు-2017 , ఏపీ భూమి అభివృద్ధి నియమాలు-2017లో మార్పులు తీసుకుని, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. లేఅవుట్లలో కనీస రోడ్డు వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించారు. గేటెడ్ కమ్యూనిటీలకు , హై-రైజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు. 30 మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం, ఐదు అంతస్తులకు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు. 500 చదరపు మీటర్లు మించిన ప్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు. టీడీఆర్ బాండ్ కమిటీలో రెవెన్యూ అధికారులు, సబ్-రిజిస్ట్రార్లను తొలగించి, ప్రక్రియలను వేగవంతం చేశారు.
దేశంలో మొదటిసారిగా భవన, లేఅవుట్ ఆమోదాలకు ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇది బిల్డర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది. హై-రైజ్ భవనాలకు సడలింపులు, నాన్-హై-రైజ్ భవనాల ఎత్తును 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, రెపో రేట్ కట్తో హౌసింగ్ లోన్లు చౌకగా దొరకడం మరింత మేలు చేస్తోంది.
నాలా చట్టాన్ని రద్దు చేసి, వ్యవసాయ భూములను నాన్-అగ్రికల్చరల్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కల్పించారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, భోగాపురం ఎయిర్పోర్ట్, హైవేల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ నిర్ణయాలతో రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం 2025లో 15-20 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనాలు మార్కెట్ వర్గాలు వేస్తున్నాయి.