పాత నిర్ణయాలన్నింటినీ కొత్తగా ప్రకటిస్తున్న ఏపీ సర్కార్..!

ప్రత్యేకహోదా ఉద్యమంలో పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు..! .. కొద్ది రోజుల కిందట.. ఇది వార్తగా రావడమే కాదు.. జీవో కూడా రిలీజ్ అయింది. ఇది చూసి.. అప్పటికే ఆ కేసుల నుంచి విముక్తి పొందిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే… టీడీపీ సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన… మైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసులు ఎత్తివేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హఠాత్తుగా వారం రోజుల కిందట… ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. సేమ్ టు సేమ్… అప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే.. డేట్ మార్చి.. కొత్తగా జగన్ సర్కార్ విడుదల చేసింది. దీన్ని చూసి.. టీడీపీ సోషల్ మడియా కార్యకర్తలు ‌ట్రోలింగ్ ప్రారంభించారు.

అది ముగిసే లోపు.. ఇప్పుడు బాక్సైట్ కోసం… అనుమతులు రద్దు అంటూ.. జగన్ సర్కార్ ఓ జీవో రిలీజ్ చేసింది. సాక్షి మీడియాలోనూ ప్రచురించుకుంది. కానీ అనమతులు ఎవరికి ఉన్నాయో… చెప్పలేకపోయారు. 2016 మార్చి 19న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో… బాక్సైట్ తవ్వకాలకు అంతకు ముందు వైఎస్ సర్కార్ ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసింది. అన్‌రాక్‌ అనే సంస్థను మన్యం నుంచి వెళ్లగొట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల ప్రక్రియ వేగవంతం అయింది. తవ్వకాల కోసం అన్‌రాక్‌ కంపెనీతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఒప్పందంలో భాగంగా, 2008 ఆగస్టు 13న 222 జీవోని, 2008 అక్టోబరు 30న 289 జీవోని జారీచేసింది. దానికి అనుమతులు రద్దు చేయడంతో అప్పుడే పని ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ జగన్ రద్దు చేశారు.

ఇదే విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జరగాలి.. పెళ్లి..మళ్లీ మళ్లీ అన్నట్లుగా… ఈ జీవోలను చూసి.. సిగ్గనిపించడం లేదా.. అని ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు.. కొత్తగా జీవోలు ఎందుకు జారీ చేయాల్సి వస్తుందో… ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ జీవో కాపీలు… సేమ్ టు సేమ్.. డేట్ మార్చి ఉండటంతో.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు కారణంగా మారుతున్నాయి. కొత్తగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం… వాటి సంగతి చూడాల్సింది పోయి.. పాత జవోలకు.. కొత్త తేదీలు వేయడం ఏమిటన్న చర్చ నెటిజన్లలోనూ జరుగుతోంది. మరి ఈ విషయంలో.. ఏపీ సర్కార్.. ఏదైనా కొత్త స్టెప్ తీసుకుంటుందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com