పోలవరానికి “క్లీన్ యూ” సర్టిఫికెట్ ఇచ్చిన జగన్ సర్కార్..!

పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ కాంట్రాక్టులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన ఏపీ సర్కార్ కు.. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి తంటాలు పడుతోంది. నిపుణుల పేరుతో పీటర్ కమిటీని నియమించి.. వేల కోట్ల అవినీతి జరిగిందని నివేదిక తెప్పించుకున్న ఏపీ సర్కార్ పెద్దలకు ఆ నివేదికే పెద్ద గుదిబండగా మారింది. అందులో చెప్పినట్లుగా .. సిఫార్సు చేసినట్లుగా.. రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నట్లుగా ప్రభుత్వం తచెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు.. ఆ నివేదికకు సాక్ష్యాలను కేంద్రం అడగడంతో… రివర్స్ అయ్యారు. ఆ నివేదికలో చెప్పినట్లుగా అవినీతి ఏమీ జరగలేదని… అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని… కేంద్రానికి మరో నివేదిక పంపారు.

ఇప్పటి వరకూ అక్రమాలంటూ వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం.. కేంద్రానికి పంపిన సమాధానంలో మాత్రం… అన్నీ కరెక్ట్ గా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈపీసీ నిబంధనల మేరకే మిగిలిన పనులకు అంచనాలకు 2016-17 ధరలను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపింది. 2015 అక్టోబరు 10న విజయవాడలో జరిగిన కేబినెట్‌ సమావేశం.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలన్న లక్ష్యం మేరకు.. 2015-16నాటి ధరలను వర్తింపజేయాలని తీర్మానించింది. ఐబీఎం కమిటీ కూడా ఈ ధరలనే వర్తింపజేయాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకూ నిపుణుల కమిటీ పేరుతో.. పోలవరంపై వేసిన అవినీతి ముద్రను ప్రభుత్వమే కడిగేసినట్లయింది.

అయితే రివర్స్ టెండర్లపై మాత్రం… ఏపీ సర్కార్ వెనుకడుగు వేయాలనుకోవడం లేదు. ముందుకే వెళ్లి.. నచ్చిన వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు.. రివర్స్ టెండర్ల ప్రక్రియ ను నేటి నుండి ప్రారంభిస్తోంది. ప్రస్తుతం… కేంద్రానికి ఏపీ సర్కార్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే… అసలు కాంట్రాక్టులు రద్దు చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం కూడా. అలాంటప్పుడు… ఎందుకు కేంద్రం.. రివర్స్ టెండర్లకు అనుమతిస్తుందనేది కీలకం. కేంద్రానికి సమగ్ర సమాచారం ఉంది కాబట్టి… చివరికి.. ఏపీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పదనే అంచనాలు కాంట్రాక్టర్ల సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటీటీ వైపు చూస్తున్న కీర్తి సినిమాలు

ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైంది.. 'పెంగ్విన్‌'. కీర్తి సురేష్ న‌టించిన ఈసినిమాకి రివ్యూలూ, రేటింగులూ ఆశాజ‌న‌కంగా లేవు. కానీ... వ్యూవ‌ర్ షిప్ మాత్రం బాగానే వ‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల...

ఎస్‌ఈసీ విషయంలో మరోసారి ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ..!

అటు కనగరాజు.. ఇటు నిమ్మగడ్డ కాకుండా.. మూడో వ్యక్తిని ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా.. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండి పడింది. అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారని అందు...

ప్రముఖులకు కరోనా ..! ఏది నిజం..? ఏది అబద్దం..?

బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కరోనా సోకింది. అయితే ఆయన దాచి పెట్టుకోలేదు. ప్రజల ముందు పెట్టారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు మాత్రం... అందుకు మినహాయింపు అయినట్లుగా ఉంది. తమకు వస్తే...

కోన వెంక‌ట్ గాలి తీసేసిన వైఎస్సార్‌

కోన వెంక‌ట్ వైకాపా సానుభూతి ప‌రుడు. జ‌గ‌న్ కి ఓ ర‌కంగా భక్తుడు. ఆప్రేమ వైఎస్సార్ నుంచే వ‌చ్చింది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఆయ‌న గొప్ప‌ద‌నాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు కోన వెంక‌ట్. ఈ రోజు...

HOT NEWS

[X] Close
[X] Close