శ‌ర్వా ల‌క్కీ ఛాన్స్ కొట్టేశాడుగా

ఈ శుక్ర‌వారం విడుద‌లైన ‘అర్జున్ రెడ్డి’ టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ అయ్యింది. ఎక్క‌డ చూసినా అర్జున్ రెడ్డి ప్ర‌స్తావ‌నే. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు సందీప్ పేరు మార్మోగిపోతోంది. అప్పుడే అడ్వాన్సుల హంగామా మొద‌లైపోయింది. హీరోలు క‌ర్చీఫ్ లేసుకోవ‌డం మొద‌లెట్టారు. కాక‌పోతే.. ఈసారి ఆ ల‌క్కీ ఛాన్స్ మాత్రం శ‌ర్వానంద్‌కే ద‌క్క‌బోతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా స‌మ‌యంలోనే శ‌ర్వా కోసం ఓ క‌థ అల్లుకొన్నాడు సందీప్‌. దాన్ని శ‌ర్వాకీ వినిపించాడు. ‘స‌రే చేద్దాం..’ అని శ‌ర్వా మాట కూడా ఇచ్చేశాడు. కాక‌పోతే… ‘అర్జున్ రెడ్డి’ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూద్దామ‌ని ఆగాడు శ‌ర్వా. ఇప్పుడు ఆ సినిమా ఓ సంచ‌ల‌నంగా మారింది. దాంతో.. శ‌ర్వా మరో మాట లేకుండా.. సందీప్‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ‘మ‌హానుభావుడు’ త‌ర‌వాత శ‌ర్వానంద్ మొద‌లెట్ట‌బోయే సినిమా ఇదేన‌ని తెలుస్తోంది. `అర్జున్ రెడ్డి` సినిమాని త‌న సొంత సంస్థ‌లో విడుద‌ల చేశాడు సందీప్‌. రెండో సినిమానీ సొంత బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.