అర్జున్ రెడ్డి ని మిస్ చేసుకొన్నారిలా..

ఏ పుట్ట‌లో ఏ పాముందో ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు? సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. బాగుందో, లేదో డిసైడ్ అవుతుంది. దాని రిజ‌ల్ట్ ముందే ప‌సిగ‌ట్టేవాడే మొన‌గాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డినే తీసుకోండి. ఈ సినిమా చూసినోళ్లంతా ఆహా.. ఓహో అంటున్నారు. శివ‌లా ట్రెండ్ సెట్ట‌ర్ అనేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా ముందు నుంచీ ప్ర‌స‌వ వేద‌న ప‌డుతూనే ఉంది. ఈ సినిమాలో ముందు అనుకొన్న హీరో… విజ‌య్ దేవ‌ర‌కొండ కాదు. ఈ క‌థ ముందుగా శ‌ర్వానంద్‌కి వినిపించారు. శ‌ర్వాకి క‌థ న‌చ్చింది. కానీ త‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల సినిమా చేయ‌లేక‌పోయాడు. ఆ త‌ర‌వాత ఈ క‌థ విజ‌య్ ద‌గ్గ‌ర ఆగింది. సినిమాని రూ.4 కోట్ల‌లో తీసేశారు. కానీ చివ‌ర్లో డ‌బ్బుల్లేవు. ప‌బ్లిసిటీ చేసుకోవ‌డానికి కూడా ఇబ్బంది ఏర్ప‌డింది. ఈ సినిమా ఎవ‌రికైనా అమ్మి ఆ డ‌బ్బుల‌తో ప్ర‌మోష‌న్లు మొద‌లెడ‌దామ‌నుకొన్నారు. కానీ.. కొన‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌లేదు. బ‌డా బ‌డా బ్యాన‌ర్లు కూడా అర్జున్ రెడ్డిని లైట్ తీసుకొన్నాయి. ఏసియ‌న్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమాని రూ.4 కోట్ల‌కు కొన్నారు. లాభాలు 50 – 50 పంచుకొంటారు. తొలి రోజే ఈ సినిమా లాభాట బాట ప‌ట్టేసింది. మ‌రోవైపు శాటిలైట్ కూడా అమ్ముకోలేదు. విడుద‌ల‌య్యాక చూద్దాంలే అనుకొన్న ఛాన‌ళ్లు ఇప్పుడు… ఈ సినిమా రైట్స్ కోసం పోటీ ప‌డుతున్నాయి. హిట్టు మ‌హ‌త్మ్సం అంతే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.