ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి చేసిన పదిహేను మందిని చంపేసిన తండ్రీకొడుకులు హైదరాబాద్ కు చెందినవారేనని తేలింది. సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే ఆ తండ్రీ కొడుకులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఐసిస్ భావజాలంతో వీరు తుపాకులు సమీకరించుకుని యూదులపై కాల్పులకు తెగబడ్డారు. వీరిద్దరూ మొదట పాకిస్తాన్ వాసులని అనుకున్నారు. కానీ వివరాలన్నీ బయటకు తీసిన తర్వాత హైదరాబాద్కు చెందిన వారని తెలిసింది.
సాజిద్ అక్రమ్.. 27 ఏళ్లకిందట ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడే ఓ క్రిస్టియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఓ అబ్బాయి. ఓ అమ్మాయి పుట్టారు. వారు ఆస్ట్రేలియా పౌరులు. కానీ సాజిద్ కు మాత్రం భారత పాస్ పోర్టు ఉంది. అతను ఇరవై ఏడేళ్ల సమయంలో కేవలం ఆరు సార్లు మాత్రమే భారత్ వచ్చాడు. బంధువులతో సంబంధాలు లేవు. ఆస్తి పంపకాల కోసం వచ్చి గొడవలు పడి వెళ్లిపోయాడని బంధువులు పోలీసులకు చెప్పారు. అంతకి మించి ఇంకా ఏమైనా లింకులు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఎందుకు వీరు ఇలా ఉగ్రబాట పట్టారన్నది పోలీసులకు అర్థం కావడం లేదు. ఇండియన్ పాస్ పోర్టు ఆధారంగానే ఇతర దేశాలకు పర్యటించాడు. దాడికి కొద్ది రోజుల ముందే ఫిలిప్పీన్స్ కు వెళ్లారు. అక్కడ వారు ఈ దాడి చేయడానికి శిక్షణ పొందారన్న అనుమానాలు ఉన్నాయి. సాజిద్ భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడని తెలియగానే.. అక్కడి అధికారులు పూర్తి సమాచారం సేకరించారు. భారత ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు.
