వ్యాపారానికి వైరస్ : ఆటోమోబైల్ ఇండస్ట్రీకి పంక్చర్..!

కోవిడ్ -19 వైరస్ దెబ్బకు కుదేలైన పారిశ్రామిక రంగాల్లో మరో కీలకమైనది ఆటోమోబైల్. ఓ రకంగా చావు దెబ్బ పడినట్లయింది. ఏదైనా ఆటోమోబైల్ సంస్థ.. తన ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపడం అంటే.. అదో ఉపద్రవంగా భావిస్తుంది. అలాంటిది పరిశ్రమలన్నీ.. ఒకే సారి మూతపడిపోయాయి. అదే సమయంలో.. అమ్మకాలు కూడా లేవు. దీంతో.. వాహన పరిశ్రమ ఓ రకమైన స్లంప్‌లోకి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉత్పత్తి మరో రెండు నెలల వరకూ ప్రారంభం కావడం కష్టమే..!

దేశంలో ఉన్న ద్విచక్ర వాహన తయారీ కంపెనీ.. కార్ల తయారీ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసిన కార్ల దిగ్గజం కియా.. ఉత్పత్తిని నిలిపివేసింది. ఆ సంస్థ గ్రూప్‌కే చెందిన హ్యుండాయ్ సంస్థ చెన్నైలోని తమ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసేసింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ కంపెనీ.. గురుగ్రామ్, మానేసర్ లోని తన ప్లాంట్లను క్లోజ్ చేసింది. టాటా సహా ఇతర వాహన తయారీ సంస్థలన్నీ అదే బాటలో ఉన్నాయి. ఈ కంపెనీలేవీ మళ్లీ ఎప్పటి నుండి ఉత్పత్తి ప్రారంభమిస్తారో చెప్పలేదు. చెప్పడానికి వారి దగ్గర కూడా సమాచారం లేదు. అంతా..కోవిడ్ -19 కంట్రోల్ ను బట్టే ఉంటుంది. ద్విచక్ర వాహన కంపెనీలన్నీ షట్ డౌన్ అయిపోయాయి. హీరో సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లన్నింటినీ మూసివేసింది. భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్‌లో హీరో ప్లాంట్లు ఉన్నాయి. హోండా కూడా తన ప్లాంట్లను మూసివేయసింది.

పది రోజులకే రూ.పదిహేను వేల కోట్ల నష్టం..!

ఆటోమోబైల్ ఇండస్ట్రీ బిజినెస్ ఏడాదికి రూ.7 లక్షల 80వేల కోట్లు. భారత జీడీపీలో ఆటోమోబైల్ రంగానికి చాలా కీలకం. మనదేశ జీడీపీ 7.5 శాతం వాటా వాహన పరిశ్రమదే. ఇప్పుడు ఈ పరిశ్రమపై పడుతున్న ఎఫెక్ట్.. దేశాభివృద్ధి పైనా పడనుంది. ఆటోమోబైల్ ఇండస్ట్రీ మొత్తానికి రోజుకు రూ. రెండు వేల కోట్ల లాభం ఉంటుందని.. బిజినెస్ మ్యాగజైన్లు అంచనా వేశాయి. ఇప్పుడు ఉత్పత్తి నిలిపివేయడంతో.. రూ. పదిహేను వేల కోట్ల నష్టం.. వస్తోందని అంచనా. ఇప్పటికిప్పుడు వైరస్ ఆగిపోయినా… సాధారణ పరిస్థితికి వచ్చే సరికి.. కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇంతకుముందులా ఉత్పత్తిని పెంచడానికి కంపెనీలకు జూన్ వరకైనా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

లక్షల సంఖ్యలో ఉద్యోగుల ఉద్వాసన తప్పకపోవచ్చు..!?

ఆటోమోబైల్ రంగంపై కరోనా వైరస్ ప్రభావం వల్ల… పెద్ద ఎత్తున ఉద్యోగులో పోనున్నాయి. ఇప్పటికే ఆయా ఆటోమోబైల్ సంస్థలు ఒప్పంద ఉద్యోగుల్ని వదిలించుకున్నాయి. ఎప్పుడు అయితే లాక్ డౌన్ ప్రకటించారో.. అప్పటి వరకూ జీతాలిచ్చేసిన సంస్థలు.. మళ్లీ అవసరం అయితే కబురు చేస్తామని తేల్చేశాయి. ఇప్పుడు లక్షలాది మంది ఆటోమోబైల్ ఇండస్ట్రీలో పని చేస్తున్న వారు. .. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ఎన్ని నెలలు ఉత్పత్తి ఆగిపోతుందో..అనని నెలల పాటు వారికి జీతాలివ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉండకపోవచ్చు. అంతే కాదు.. ఆ తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా ఇంతకు ముందున్నట్లుగా ఉండదు కాబట్టి.. డిమాండ్ కూడా..తగ్గిపోతుంది.దానికితగ్గట్లుగా ఉద్యోగాల్లోనూ కోత పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close