తెలంగాణ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టనున్న కేసీఆర్..!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా సూటిగా.. సుత్తి లేకుండా చేసేస్తారు. కరోనాను కట్టడి చేసేందుకు కేసీఆర్ తీసుకుంటున్న చర్యల విషయంలో ఆయన ప్రత్యర్థులు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వాటిపై ఆయన ఎలాంటి తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారో.. తర్వాత కూడా.. అలాంటి నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది కరోనా కట్టడికి కాదు.. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ..తగ్గిపోయిన ఆదాయంతోనే.. రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి. కరోనా ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పాల్సినదంతా చెప్పారు. చివరికి లేచి వెళ్లిపోయే ముందు ఓ మీడియా ప్రతినిధి అన్యాపదేశంగా ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ తడుముకోకుండా సమాధానం చెప్పారు.

జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని.. వారికి కోత పెట్టక తప్పదేమోనన్నారు. ఎమ్మెల్యేలందరి జీతాలు కోత పెట్టడం ఖాయమని.. కేసీఆర్ మాటలను బట్టి అర్థమవుతోందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి పంచుకుంటేనే భారం తగ్గుతుందన్నారు. పదిహేనో తేదీ నుంచి.. ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ ఇలా మొత్తం ఆదాయం ఆగిపోయినప్పుడు.. ఇక ఆర్థిక పరిస్థితి ఎక్కడ బాగుంటుందని కేసీఆర్ ప్రశ్న. ఈ విషయంలో..కేసీఆర్.. కేంద్రంపైనా.. నిందలు వేయడానికి సిద్ధంగా లేరు. రాష్ట్రాలకు ఆదాయం లేనప్పుడు.. కేంద్రానికి ఎక్కడ నుంచి వస్తుందని.. అందుకే.. కేంద్రం నుంచి కూడా ఆశించలేకమన్నారు. మూడు నెలల పాటు గడ్డు పరిస్థితులు ఉంటాయని కేసీఆర్ అంచనా వేశారు. గట్టెక్కేదాకా అందరూ ఊపిరి బిగపట్టుకుని ఉండాలన్నారు.

తెలంగాణ సీఎం ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు చెప్పలేదు. ఓ మీడియా ప్రతినిధి అడిగితేనే చెప్పారు. అయితే.. ఇప్పటికే…దీనిపై ఓ ఆలోచన ఉన్నట్లుగా సమాధానం చెప్పడంతో… ఉద్యోగవర్గాల్లో కలకలం ప్రారంభమయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు ఆపినా..అత్యధికులు టీఆర్ఎస్ వాళ్లే కాబట్టి.. ప్రశ్నించే అవకాశం ఉండదు. కేసీఆర్ హింట్ ఇచ్చినట్లు జీతాలు తగ్గిస్తే..ఉద్యోగులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

సుధాకర్ కేసులో “గుర్తు తెలియని అధికారుల”పై సీబీఐ కేసులు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ సుధాకర్ వద్దకు వెళ్లి వాంగ్మూలం...

కరోనా ఆపత్కాలంలో… తానా తరపున పేదలకి అండగా నిలిచిన రవి పొట్లూరి

యావత్‍ ప్రపంచం అల్లాడుతున్న వేళ...ఒకరికొకరు అండగా నిలబడాల్సిన ఆపత్కాల సమయం, సమాజం అంతా కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ఓ భరోసానిచ్చే సంస్థ గాని వ్యక్తులు గాని మన ముందుకు వస్తే ఎంత సంతోషంగా...

HOT NEWS

[X] Close
[X] Close