కరోనా కష్టాలు : జర్మనీలో ఓ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆత్మహత్య..!

కరోనా వైరస్ కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. అసలు తగ్గే పొజిషన్‌లో కూడా లేదు. ఏ స్థాయిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు. కానీ అప్పుడే… సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపించడం ప్రారంభించింది. ఆయా దేశాలను పరిపాలిస్తున్న పాలకులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొంత మంది గుండె ధైర్యంతో ఉంటే.. మరికొంత మంది … జావకారిపోతున్నారు. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. జర్మనీలోని ఓ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు.

జర్మనీలోని హెస్సీ అనే రాష్ట్రానికి ధామస్ షిఫర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కరోనా వైరస్‌ జర్మనీపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తూండటంతో.. అక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో.. ఆర్థిక మంత్రిగా ఉన్న థామస్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరిస్థితుల్ని మెరుగుపర్చాలో తెలియక సతమతమవుతున్నారు. కరోనాను ఎదుర్కొని.. జీవితాల్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తారని …చితికిపోయిన తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు కనిపించే మార్గం ధామస్‌కు కనిపించలేదు.

జర్మనీలోని హెస్సీ రాష్ట్రం ఆర్థికంగా ఆ దేశంలోనే కీలకమైన రాష్ట్రంగా ఉంది. ఫ్రాంక్ ఫర్ట్ ..ఈ రాష్ట్రంలోని నగరమే. ప్రఖ్యాత వ్యాపార సంస్థల హెడ్ క్వార్టర్లు ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్నాయి. ఆర్థిక సేవల రాజధానిగా ఫ్రాంక్ ఫర్ట్‌కు పేరు ఉంది. ప్రపంచంలో ప్రముఖ బ్యాంక్‌గా పేరున్న డూషే బ్యాంక్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. హెస్సీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ధామస్ పదేళ్లుగా వ్యవహరిస్తున్నారు. సమర్థునిగా పేరుత తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం.. ఆయనకు అర్థం కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close