ప్రొ.నాగేశ్వర్: కశ్మీర్ సమస్యకు పరిష్కారం స్వయం ప్రతిపత్తేనా..?

కశ్మీర్ సమస్య రోజు రోజుకు జఠిలమవుతోంది. కొన్ని చారిత్రక పరిస్థితుల్లో జమ్మకశ్మీర్ భారత్‌లో విలీనం అయింది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జమ్మూకశ్మీర్ భారత్ లో భాగం కాదు. ఆ సమయంలో కశ్మీర్ ప్రజలు కోరుకుంటే.. పాకిస్థాన్‌లో అయినా కలసి ఉండేవారు. లేదా స్వతంత్ర దేశంగా అయినా ఏర్పడగలిగేవారు. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి కూడా భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అలాంటి పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు భారత యూనియన్‌లో భాగం కావాలని నిర్ణయించారు.

స్వయంప్రతిపత్తి హామీలోనే భారత్‌లో విలీనం..!
కశ్మీర్ ప్రజలు భారత్‌లో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నందుకు..భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ఓ హామీ ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో విలీనం అవుతున్నారు కాబట్టి… స్వయం ప్రతిపత్తి ఇచ్చేందుకు అంగీకరించింది. రాజ్యంగంలో ఆర్టికల్ 370 కింద ఓ అధికరణం కేటాయించింది. దీని ప్రకారం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకమైన హక్కులు వస్తాయి. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు. ఈ ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేస్తూ .. జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడం ప్రారంభించారు. దీంతో జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో.. భారత ప్రభుత్వ పెత్తనం పెరుగుతోందన్న భావన పెరిగిపోయింది. దీన్ని మత చాందసవాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దీంతో కశ్మీర్ ప్రజల్లో అశాంతి పెరిగిపోతూనే ఉంది. అది అంతిమంగా కశ్మీర్ లోయలో రావణకాష్టానికికారణం అవుతోంది.

తెలంగాణలో ఎందుకు ప్రజల్లో ఆవేశం వచ్చింది..?
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు. ఏపీ, తెలంగాణను కలిపినప్పుడు.. తెలంగాణకు ఆర్టికల్ 371డి ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. తెలంగాణ భూముల్ని రిజనల్ కమిటీ అనుమతి లేకుండా ఇతరుల కొనరాదు. అలాగే ఓ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఉంటే.. మరో ప్రాంతానికి.. ఉపముఖ్యమంత్రి పదవి ఉండాలి. ఇలా సిక్స్ పాయింట్ ఫార్ములాతో.. పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నారు. ఇవి అమలు కాలేదు కాబట్టే.. ప్రజల్లో ఉద్యమం వచ్చింది. రాష్ట్రం విడిపోయింది. ఆ సిక్స్ పాయింట్ ఫార్ములా కరెక్ట్ గా అమలయి ఉంటే.. ఉద్యమం వచ్చేది కాదు. రాష్ట్రం విడిపోయిది కాదు. ఇప్పుడు హామీలోనూ..అంతే.. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి..ఇప్పుడు లేదంటున్నారు. అందుకే ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది.

మిలటరీతో కశ్మీర్‌ను అదుపులో ఉంచగలమా..?
కశ్మీర్‌ను పూర్తిగా మిలటరీ సాయంతో… అధీనంలో ఉంచుకోగలమా..? వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టి.. కేవలం మిలటరీ సాయంతో భయపెట్టి… జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా ఉంచలేము. అక్కడి ప్రజల మనసుల్ని గెలవకుండా ఇది సాధ్యం కాదు. జమ్మూకశ్మీర్‌ అనేది భారత్‌లో అంతర్భాగం. జమ్మూకశ్మీర్ విలీనాన్ని మార్చడానికి వీల్లేదు. భారత సార్వభౌమాధికారానికి లోబడి.. రాజ్యాంగానికి లోబడి.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఇస్తామని చెప్పడం ద్వారానే జమ్మూకశ్మీర్‌ను భారత్ వైపు ఉంచగలం. కానీ దీనికి పూర్తి భిన్నమైన వైఖరి తీసుకుంటున్నారు. బీజేపీ ఆర్టికల్ 370కి వ్యతిరేక వైఖరి తీసుకుంది. పీడీపీ భారత దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వైఖరి తీసుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆశ్చర్యం

కశ్మీర్ ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నాలేవి..?
ఓ ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడే శాంతి లేనప్పుడు… గవర్నర్ పాలన పెడితే.. పరిస్థితులు చక్కబడతాయా..?. బీజేపీ కశ్మీర్ ప్రజలకు…రెండు ముఖ్యహామీలు ఇచ్చింది. ఒకటి కశ్మీరీ ప్రజలకు విశ్వాసం కల్పించే చర్యలు చేపడాతమన్నారు. అందరితో చర్చలు జరిపి… ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడేమంటున్నారు… సైనిక సంపత్తితో ఎదుర్కొంటాంటామంటున్నారు. బుల్లెట్లతో దూసుకొచ్చేవారిని తుపాకులతోనే ఎదుర్కోవాలి. అందులో తప్పు లేదు. కానీ ప్రజలందర్నీ తీవ్రవాదులుగా చూడలేరు. అంటే..తీవ్రవాదల నుంచి ప్రజల్ని దూరం చేయాలి. అలా జరగాలంటే.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి. దానికి రాజకీయ పిరష్కారం ముఖ్యం. దీని కోసం ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించడమే పరిష్కారం..!
జమ్మూకశ్మీర్‌ 1947లో భారతదేశంలో విలీనం కాలేదు. అది తర్వాత కాలంలో నిర్ణయం తీసుకుని భారతదేశంలో భాగమయ్యారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా.. అక్కడి ప్రజల మనోభావాల్ని గుర్తించకుండా శాంతి తీసుకురాలేం. దీన్ని గుర్తించకుండా.. రాజకీయ కారణాలతో కశ్మీర్ సమస్యను జఠిలం చేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం… పీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయ అవసరాలతో పీడీపీతో దూరమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఏ రకంగా శాంతి నెలకొల్పుతారు…? దీని ఏ రకంగా..రాజకీయం పరిష్కారం చూపిస్తారు..? పాకిస్తాన్‌కు అవకాశం ఇవ్వకూడదనుకుంటే.. కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలి. అలా కాకుండా అణచి వేస్తామంటే… సాధ్యమయ్యే పని కాదు. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే… స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడమే ఓ పరిష్కారం. . స్వయంప్రతిపత్తి ఇవ్వడమేంటే…దేశం నుంచి విడిపోవడం కాదు. దేశం నుంచి విడిపోవాలనే వారితో… రాజ్యాంగాన్ని గౌరవించని వారితో ఎలాంటి రాజీ లేదు. కానీ రాజ్యాంగానికి లోబడి… కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెదకాలి. అలా కాకుండా.. కేవలం మిలటరీతోనే పరిష్కారం కనుగొంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close