అర్థరాత్రి కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

కత్తి మహేష్.. ఈ పేరు ఇప్పుడు పరిచయం లేనంత పబ్లిసిటీ గతంలోనే వచ్చింది. కాకపోతే.. తర్వాత సైలెంటయిపోయారు. తనను మీడియా పట్టించుకోవడం లేదని ఫిలయ్యారేమో కానీ.. నాలుగు రోజుల కిందట.. ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొని రచ్చ రచ్చ చేశారు. రాముడిని అత్యంత దారుణంగా కించ పరిచారు. సీతపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సహజంగా వెంటనే పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపధ్యంలో.. సోమవారం అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీసులు.. కత్తి మహేష్‌ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఓ సినీ రివ్యూయర్‌గా తొలి బిగ్‌బాస్‌లో చోటు సంపాదించిన కత్తి మహేష్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి కావాల్సినంత ప్రచారాన్ని పొందారు. అతనిది అంతా రాజకీయ కోణం అని ప్రచారం జరిగినా… మీడియా ఇచ్చిన హైప్‌తో ఓ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. మీడియా పట్టించుకోవడం లేదు. దాంతో.. రాముడిపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకునేవరకూ వెళ్లింది పరిస్థితి.

భావ స్వేచ్ఛ పేరుతో.. దేవుళ్లను కించ పరిచేసి. పబ్లిసిటీ పొందుతామనుకునేవారు ఇటీవలి కాలంలో పెరిగిపోయారు. రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది.. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడానికి కాదుగా. ఎవరి నమ్మకాలు వారివి. రాముడెలాంటి వారో.. సీత క్యారెక్టర్ ఏమిటో.. కత్తి మహేష్‌కి ఎవరైనా సర్టిఫికెట్ ఇమ్మని అడిగారా..?. కానీ ఇలాంటి ప్రకటనలు చేస్తే..మళ్లీ టీవీల్లో వెలిగిపోవచ్చని.. కాసింత పబ్లిసిటీ వస్తుందని కత్తి మహేష్ ఆశ పడ్డారు. అయితే పవన్ కల్యాణ్‌ను విమర్శించినట్లు కాదుగా… రాముడిపై నిందలేయడం. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అరెస్టులదాకా తీసుకెళ్లింది. తర్వాత ఏంజరుగుతుందో.. వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close