బోయ‌పాటి ఏం మార‌లేదు… బాల‌య్య సినిమా బ‌డ్జెట్ 70 కోట్లు

`విన‌య విధేయ రామ‌` ప‌రాజ‌యం, ప‌రాభ‌వం బోయ‌పాటిని కాస్త ఇబ్బందుల్లో ప‌డేసింది. కావ‌ల్సిన‌దానికంటే నిర్మాత‌తో ఎక్కువ ఖ‌ర్చు పెట్టించాడ‌ని బోయ‌పాటిపై అభియోగం. ఈ సినిమాకి దాదాపుగా వంద కోట్లు ఖ‌ర్చ‌య్యింద‌ని నిర్మాత లెక్క‌లు చెబుతున్నాడు. ఈ ఫ్లాప్‌తో బోయ‌పాటి మార‌తాడ‌ని, త‌దుప‌రి సినిమాల బ‌డ్జెట్ విష‌యంలో కాస్త ఆచి తూచి ఆలోచిస్తాడ‌ని అనుకున్నారంతా. కానీ బోయ‌పాటి ఏం మార‌లేదు. త‌న త‌దుప‌రి సినిమాకి 70 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని అడిగాడ‌ట‌.

బోయ‌పాటి – బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. దీనికి బాల‌య్యే నిర్మాత‌. క‌థ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.70 కోట్ల‌ని టాక్‌. బాల‌య్య‌పై ఇది రిస్కు వ్య‌వ‌హార‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య సినిమాలేవీ 70 కోట్లు చేయ‌లేదు. తాజాగా ఎన్టీఆర్ బ‌యోపిక్ 20 కోట్లు చేయ‌లేక డీలా ప‌డింది. కానీ బోయ‌పాటి తో వ్య‌వ‌హారం వేరు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కి ఉన్న క్రేజ్ వేరు. అందుకే… బ‌డ్జెట్ విష‌యంలో బోయ‌పాటి రాజీ ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే…. బాల‌య్య ఇంకా ఈ బ‌డ్జెట్‌పై ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. బడ్జెట్ త‌గ్గించు.. అంటాడా? లేదంటే ఇది వ‌ర‌కు రెండు హిట్లు ఇచ్చాడు కాబ‌ట్టి, బోయ‌పాటిని న‌మ్మేసి ముందుకెళ్తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com