`నాగకన్య` ట్రైలర్‌: గ్రాఫిక్స్‌ భయపెడుతున్నాయ్‌

హర్రర్‌ చిత్రాల్లో ట్విస్టులు, ఎఫెక్టులు భయపెట్టాలి. `నాగకన్య` ట్రైలర్‌లో మాత్రం గ్రాఫిక్స్‌ భయపెడుతున్నాయ్‌. తమిళ్‌లో రాయ్‌ లక్ష్మి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, కేథరిన్‌ నటించి `నీయ 2` చిత్రాన్ని తెలుగులో `నాగకన్య`గా డబ్బింగ్‌ చేస్తున్నారు. పగటిపూట ఆడపిల్లగా, రాత్రిపూట పాముగా బతలేక అవస్థలు పడే అమ్మాయి కథ ఈ `నాగకన్య`. హీరోయిన్లు ముగ్గురిలో నాగకన్య ఎవరో ట్రైలర్‌లో రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌గా వుంచారు. ముగ్గురిలో నాగకన్య లక్షణాలు చూపెడుతూ, ఎవరు హీరోకి భార్య అనేది రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ మెంటైన్‌ చేశారు. భక్తికీ, భయానికీ బాగా ముడిపెట్టినా, కథపై పెట్టిన కాన్సంట్రేషన్‌ గ్రాఫిక్స్‌ మీద పెట్టలేదు. నాశిరకం గ్రాఫిక్స్‌తో భయపెట్టారు. ట్రైలర్‌లో గ్రాఫిక్స్‌ ఇంతిలా వుంటే సినిమాలో గ్రాఫిక్స్‌ ఎలా వుంటాయో? హీరోయిన్లకు గ్లామర్‌ ఇమేజ్‌ వుండటం సినిమాకు ప్లస్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.