మోడీని చంద్రబాబు గౌరవించలేదని బాధపడుతున్న వైసీపీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీపై పూర్తి సానుకూలత ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నేత.. ఆనం రామనారాయణరెడ్డి.. నరేంద్రమోడీ పర్యటనలో ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని.. చెలరేగిపోయారు. మోడీ గౌరవానికి చంద్రబాబు భంగం కలిగించారంటూ… విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రవర్తన సంస్కార హీనంగా ఉంది ఆనం రామనారాయమరెడ్డి బాధపడిపోయారు. ఆంధ్రుల పరువు తీశారని.. ఆవేదన చెందారు. ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా?.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రకంగా ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించినట్లయింది. ఏపీకి మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి… మనకు ఏం కావాలో వినయం చెప్పుకోవాలని.. ఆనం రామనారాయణరెడ్డి .. చంద్రబాబుకు వినయ విధేయతలు నేర్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమని కూడా ఆగ్రహించారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్‌ అధికారులు… మంత్రులు వెళ్లలేదు…ఇంతకంటే దుర్మార్గం లేదని తీర్మానించారు.

ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఏపీకి వచ్చారు.. వెళ్లారు. ఆయన విభజన హామీలపై మట్లాడతారేమోనని.. ప్రజలంతా ఎదురు చూశారు. కానీ..మోడీ కేవలం చంద్రబాబును తిట్టి… ఏపీకి కావాల్సివన్నీ ఇస్తామని నోటిమాటగా చెప్పి పోయారు. కానీ రైల్వేజోన్ నుంచి ప్రత్యేకహోదా వరకు ఎలాంటి హామీలపైనాప్రకటన చేయలేదు. దీనిపై.. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూంటే… వైసీపీ నేతలు మాత్రం.. దీని గురించి స్పందించడం లేదు. మోడీ గౌరవానికి భంగం వాటిల్లుతోందంటూ.. వారు బాధపడిపోతున్నారు. ఓ వైపు .. ఏపీకి ఇవ్వాల్సిన గౌరవం మోడీ ఇవ్వడం లేదని.. ప్రజలు అనుకుంటూంటే.. చంద్రబాబు మోడీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని.. వైసీపీ ఫీలవుతోంది.

ఆంధ్రప్రదేశ్ కు… బీజేపీ దారుణంగా అన్యాయం చేసినప్పటికీ.. వైసీపీ.. నేతలు మాత్రం.. ఆ పార్టీకే మద్దతు తెలియచేస్తున్నారు. ఏపీ కి ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. కానీ.. టీడీపీనే.. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉందని.. ఎదురు దాడి చేస్తున్నారు కానీ.. ఇప్పుడు పోరాడే విషయంలో వైసీపీ నేతలు…. ఇంకేదో ప్రయోజనం చూసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close