రామ్ – బోయ‌పాటి సినిమాలో బాలయ్య‌

రామ్ క‌థానాయ‌కుడిగా, బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే క్లాప్ కొట్టారు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న‌`ది వారియ‌ర్` పూర్తి కాగానే, బోయ‌పాటి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. అయితే ఈ కాంబోకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిందిప్పుడు.

రామ్ – బోయ‌పాటి సినిమాలో బాల‌య్య కూడా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అయితే… ఆయ‌నేం ఈ సినిమాలో న‌టించ‌డం లేదు. కాక‌పోతే, ఆయ‌న ప్ర‌స్తావ‌న ఈ సినిమాలో ఉండ‌బోతోంద‌ట‌. `జై బాల‌య్య‌` నినాదం బాల‌య్య అభిమానుల‌కు ఇష్టం. బాల‌య్య ఉన్నా, లేక‌పోయినా… జై బాల‌య్య అనే పేరు ఓ మంత్రంలా జ‌పిస్తుంటారు. బాల‌య్య అభిమానుల‌కు న‌చ్చేలా.. ఈ సినిమాలో `జై బాలయ్య‌` నినాదాల‌తో మార్మోగిపోయేలా ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ ని రూపొందించ‌నున్నాడ‌ట బోయ‌పాటి. ఈ సినిమాలో రామ్‌.. బాలయ్య అభిమానిగా క‌నిపించ‌నున్నాడ‌ని, ఓ స‌న్నివేశం మొత్తాన్ని బాల‌య్య రిఫ‌రెన్సుల‌తో.. నింపేశాడ‌ని… ఆ సీన్‌కు గూజ్‌బ‌మ్స్ రావ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం అందుతోంది. ఇది వ‌ర‌కు వెండి తెర‌పై చాలా మంది హీరోలు బాల‌య్య అభిమానులుగా క‌నిపించారు. అయితే ఇక్క‌డ ఈ సీన్‌ని డిజైన్ చేసింది బోయ‌పాటి. ఆయ‌న బాల‌య్య‌కు వీరాభిమాని. త‌ను త‌న హీరోని ఎలా చూపిస్తాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పైగా బాలయ్య అభిమానిగా మార్చేస్తే… ఇక హ‌ద్దులుండ‌వు. మ‌రి ఈసారి బోయ‌పాటి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close