సంక్రాంతి అంటే బాలకృష్ణ… బాలకృష్ణ అంటే సంక్రాంతి. ఈ సీజన్ బాలయ్యకు కలిసొచ్చినంతగా ఏ హీరోకీ కలిసి రాలేదనడంలో అతిశయోక్తి లేదు. 2027 సంక్రాంతి రేసులో బాలయ్య కూడా ఉన్నారు. ఆయన్నుంచి వచ్చే పండక్కి ఓ సినిమా ఖాయం.
బాలయ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు మరో సినిమాని మొదలెట్టడానికి రెడీగా ఉన్నారు బాలయ్య. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అయితే విజయ్ సినిమానే సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలన్నది బాలయ్య ఆలోచన. ఈలోగా గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి చేస్తారు. ఆ తరవాత విజయ్ సినిమా మొదలెట్టి, దాన్ని నాన్ స్టాప్ గా పూర్తి చేస్తారు. అంటే ఒకేసారి రెండు సినిమాలు లాగించేస్తారన్నమాట. ముందు విజయ్ సినిమా, ఆతరవాత గోపీచంద్ సినిమా వస్తాయి.
అయితే కాంబో పరంగా బాలయ్య – గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. గోపీచంద్ ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పైగా బాలయ్యతో హిట్ కాంబో కూడా. వీరిద్దరి కాంబోలో `వీర సింహారెడ్డి` వచ్చింది. అది కూడా సంక్రాంతి బొమ్మే. అయినప్పటికీ గోపీచంద్ సినిమా కాకుండా, విజయ్ కనకమేడల ప్రాజెక్ట్ ని సంక్రాంతి రేస్ లోకి తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం విజయ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.
